https://oktelugu.com/

Anasuya: ఈ సినిమాకు అనసూయ అందం, నటనే ఆకర్షణ- ఫ్లాష్​బ్యాక్​ టీమ్​

Anasuya: అనసూయ భ‌ర‌ద్వాజ్‌ అనండం కంటే… జబర్దస్త్ అనసూయ అంటే ప్రేక్షకులు త్వరగా గుర్తు పట్టగలరు ఎందుకంటే అంత క్రేజ్ తెచ్చిపెట్టింది జబర్దస్త్ అనసూయకి అని చెప్పాలి. అటు యాంకర్ గా ఇటు సినిమాల్లో మంచి గుర్తింపు పొందారు అనసూయ. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర తన సినిమా కెరియర్ ను మార్చింది అనే చెప్పాలి. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో ఒక కీలకమైన పాత్రలో చేస్తున్నారు అనసూయ.  అంతేకాకుండా కోలీవుడ్ లో కూడా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 27, 2021 / 11:27 AM IST
    Follow us on

    Anasuya: అనసూయ భ‌ర‌ద్వాజ్‌ అనండం కంటే… జబర్దస్త్ అనసూయ అంటే ప్రేక్షకులు త్వరగా గుర్తు పట్టగలరు ఎందుకంటే అంత క్రేజ్ తెచ్చిపెట్టింది జబర్దస్త్ అనసూయకి అని చెప్పాలి. అటు యాంకర్ గా ఇటు సినిమాల్లో మంచి గుర్తింపు పొందారు అనసూయ. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర తన సినిమా కెరియర్ ను మార్చింది అనే చెప్పాలి. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో ఒక కీలకమైన పాత్రలో చేస్తున్నారు అనసూయ.  అంతేకాకుండా కోలీవుడ్ లో కూడా తన సినిమా ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఈ అమ్మడు.

    Anasuya

    Also Read: దిశా పటానీ నిజంగానే సర్జరీ చేయించుకుందా?.. ట్రోల్స్​తో ఆడుకున్న నెటిజన్లు

    కాగా, అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా ఫ్లాష్​బ్యాక్​. తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. డాన్​ సాండీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనసూయతో పాటు, రెజీనా, ప్రభుదేవా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా, ఈ సినిమాకు అనసూయ అందం, అభినయం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం తెలిపింది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్​ లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం.

    రెజీనా అందులో ఆంగ్లో ఇండియన్ టీచర్​గా కనిపించగా.. అనసూయ, ప్రభుదేవ విభిన్నమైన పాత్రల్లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగులో ఏఎన్​ బాలాజీ విడుదల విడుదల చేయనున్నారు. తెలుగులో రంగస్థలం సినిమాకు దక్కిన ఆదరణ అలాంటి విజయాన్ని.. కోలీవుడ్ సినిమా లో కూడా అందుకుంటుందో లేదో చూడాలి మరి ఈ భామ. మరోవైపు పుష్ప సినమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది అనసూయ. ఇటీవలే ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల కాగా.. అందులో భిన్నమైన పాత్రలో అలరించింది ఈ ముద్దుగుమ్మ.

    Also Read: మద్యం కలుపుతూ బుట్టబొమ్మ వీడియో వైరల్​.. ఇంత చీప్​ టేస్ట్​ అనుకోలేదంటూ ట్రోల్స్​!