Anasuya Bharadwaj: అనసూయ లేటెస్ట్ మూవీ పెదకాపు 1. ఈ చిత్రంలో ఆమె కీలక రోల్ చేశారు. సినిమా మాత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కనీసం కోటి రూపాయల వసూళ్లు రాలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన నేపథ్యంలో ఈ తరహా రిజల్ట్ ఊహించనిదే. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు మరో షాక్ తగిలింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిన శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవంతో బోల్తా పడ్డాడు. ఈ సినిమా ఇచ్చిన షాక్ కి కొన్నాళ్ళు పరిశ్రమకు దూరమయ్యాడు. అంతకు మించిన దారుణ ఫలితం పెదకాపు 1తో చూశాడు.
ఎంతో కొంత వసూళ్లు రాబట్టాలన్నా నెపంతో విరివిగా ప్రోమోట్ చేస్తున్నారు. అనసూయ సోషల్ మీడియా చాట్ లో పాల్గొంది. పెదకాపు చిత్ర విశేషాలు పంచుకుంది. తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు తెలియజేసింది. ఈ క్రమంలో నెటిజెన్స్ వ్యక్తిగత విషయాలు కూడా చర్చకు వచ్చాయి. ఓ నెటిజెన్… మీ ఇంట్లో ఎవరు వంట బాగా చేస్తారని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పారు.
ఆ విషయంలో మా ఆయన కంటే నేనే బెటర్. భర్తకు ప్రేమగా వండి పెడతాను. ఆయన కూడా వంట చేస్తారు. కానీ నేనే బాగా చేస్తాను అని అనసూయ వెల్లడించింది. అనసూయ సుశాంక్ భరద్వాజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దాదాపు పదేళ్లు డేటింగ్ చేసిన ఈ జంట పెద్దల అనుమతితో ఒక్కటయ్యారు. సుశాంక్ ది బీహార్. మొదట్లో భర్త కుటుంబ కట్టుబాట్ల వలన ఇబ్బంది పడిందట. తర్వాత అలవాటు అయ్యాయి. సుశాంక్ పేరెంట్స్ కి నేనే అర్థం అయ్యేలా చెప్పానని అనసూయ ఓ సందర్భంలో అన్నది.
మరోవైపు అనసూయ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. యాంకరింగ్ మానేసిన ఆమె నటనపై దృష్టి పెట్టింది. అనసూయ ఖాతాలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప 2. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో దాక్షాయణిగా అనసూయ డీగ్లామర్ రోల్ చేయనుంది. ఇక అల్లు అర్జున్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన పుష్ప చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2పై ఇండియా వైడ్ అంచనాలున్నాయి. పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది.