Asian Games 2023: ఇండియన్ క్రికెట్ టీం లో ఉన్న చాలా మంది ప్లేయర్లు చాలా మ్యాచులు ఆడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ వాళ్ల ఎంటైర్ కెరియర్ లో వాళ్ళు ఒక్కసారైనా ఇంటర్నేషనల్ టీం కి మ్యాచులు ఆడాలని అలాగే ఒక్కసారైనా ఇండియన్ జర్సీ వేసుకోవాలని చాలా మంది క్రికెటర్లు అనుకుంటూ ఉంటారు. నిజానికి చాలా మంది ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడకుండానే రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఉంటారు.అలాంటి టైం లో కొంతమంది మాత్రం ఇండియన్ టీం కి ఆడుతూ అద్భుతాలు క్రియేట్ చేస్తూ ఉంటారు.
ఇక ఏషియన్ గేమ్స్ లో మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ లో స్థానం సంపాదించుకున్న రవి శ్రీనివాస్ సాయి కిషోర్ ఇండియా నేపాల్ మీద ఆడిన మొదటి మ్యాచ్ లో తను డెబ్యూ చేయడం జరిగింది.అయితే సాయి కిషోర్ మొదటి సారి మ్యాచ్ ఆడుతున్న సందర్భం లో జాతీయ గీతాన్నిఆలపిస్తున్న టైం లో ఆయన కండ్ల నుంచి కన్నీరు రావడం జరిగింది.ఎన్నో ఏళ్ళు గా ఇండియన్ జర్సీ వేసుకోవాలి అని కలలు కంటున్నా ఆయనకి ఒక్కసారి గా ఈ అవకాశం రావడం అలాగే ఆయన ఇండియన్ టీం లో ఆడటం ఇవన్నీ చూసి ఆయన కండ్ల ల్లో నుంచి ఆనందబాష్పాలు రావడం జరిగింది.
ఇక ఇది చూసిన చాలా మంది ఇండియన్ అభిమానులు సైతం కన్నీరు పెట్టుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు.నిజంగా ఒక ప్లేయర్ తన దేశం తరుపున ఇంటర్నేషనల్ మ్యాచ్ లకి ఆడటం అంటే దానికి మించిన ఆనందం ఏం ఉండదు ఎన్ని కోట్లు పెట్టిన దొరకని ఆనందం అది అలాంటి టైములో ఒకసారి మన జర్నీని ఊహించుకుంటే ఆటోమేటిగ్గా మన కండ్లు చెమ్మగిల్లడం సర్వ సాధారణం…
అయితే 26 ఏళ్ళ సాయి కిషోర్ ఎడమచేత్తో బౌలింగ్ చేస్తూ బ్యాట్స్ మెన్స్ ని కట్టడి చేయడంలో దిట్ట. అయితే ఈయన ఇప్పటికి ఎప్పుడో ఇండియన్ టీం లోకి రావాల్సింది కానీ ఆయనకి సరైన అవకాశం రాలేదు. ఐపీఎల్ లో గత సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడిన ఆయనకి ఆ టీం లో మ్యాచ్ లు ఆడే అవకాశం రాలేదు. ఆయన ఎప్పుడు బెంచ్ కె పరిమితం అయ్యాడు. ఇక దానితో ఐపీఎల్ 2023 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ టీం తరుపున బరిలోకి దిగిన ఈయన సూపర్ గా బౌలింగ్ చేస్తూ గుజరాత్ టీం విజయం లో కీలక పాత్ర వహించాడు.ఇక ఈరోజు ఏషియన్ గేమ్స్ లో భాగంగా జరిగిన ఇండియా నేపాల్ మ్యాచ్ లో కూడా బౌలింగ్ చేసి ఒక వికెట్ తీసి ఇండియా విజయం లో తన వంతు పాత్ర పోషించాడు…ఇక ఈయన కూడా తొందర్లోనే ఇండియా మెయిన్ టీం కి క్రికెట్ ఆడుతాడు అనడం లో ఎంత మాత్రం సందేహం లేదనే చెప్పాలి..
The emotional Sai Kishore during India’s national anthem.
He bowled really well on his debut – 1/26 in the Quarter Finals of Asian Games. pic.twitter.com/sWD9Afx9TD
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 3, 2023