Homeజాతీయ వార్తలుAgnipath KCR Political Weapon: యాంటీ బీజేపీ: అగ్నిపథ్ కాల్పుల్లో మరణించిన రాకేష్ ను హీరోను...

Agnipath KCR Political Weapon: యాంటీ బీజేపీ: అగ్నిపథ్ కాల్పుల్లో మరణించిన రాకేష్ ను హీరోను చేస్తున్న టీఆర్ఎస్

Agnipath KCR Political Weapon: తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజులవి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలతో విసిగి వేసారిపోయిన యువకులు ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అప్పుడు క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ అగ్రనాయకులు ఉన్నా లేకపోయినా ఆ పార్టీకి మైలేజ్ వచ్చేది. మీడియా కూడా ఆ పార్టీకి హైప్ ఇచ్చేది. తెలంగాణ రాకుంటే తల కోసుకుంటా మెడ కోసుకుంటా అనే కేసీఆర్ దగ్గర్నుంచి… ఒంటిపై పెట్రోలు పోసుకుని అగ్గిపెట్టె కోసం వెతికిన హరీష్ రావు వరకు అందరు కూడా ఉద్రిక్త పరిస్థితులకు బీజం వేసిన వాళ్ళే. ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్రంలో చాలా తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. మొన్న జరిగిన గౌరవెల్లి ఘటన, గత కొద్ది రోజులుగా జరుగుతున్న బాసర విద్యార్థుల ఆందోళన.. వీటిల్లో ఏ ఒక్క సమస్య పరిష్కారానికి టీఆర్ఎస్ నాయకులు చొరవ తీసుకున్నట్టు కనబడటంలేదు. కానీ నిన్న అగ్నిపథ్ కు నిరసనగా ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వీరంగం సృష్టించారు. ఈ క్రమంలో ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ అనే యువకుడు మృతి చెందాడు. సరిగ్గా దీనినే టిఆర్ఎస్ రాజకీయంగా వాడుకోవాలి అనుకోని మాస్టర్ ప్లాన్ కు తెరదీసింది.

Agnipath KCR Political Weapon
KCR

రంగంలోకి కేసీఆర్

నిన్న ఉదయం సికింద్రాబాద్ లో ఆందోళనలు మొదలైనప్పటి నుంచి ప్రభుత్వపరంగా ఆందోళనలు చల్లార్చే ప్రయత్నం జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి. పైగా ఆందోళనకారులు రెచ్చగొట్టే ట్వీట్లు టీఆర్ఎస్ విభాగం నుంచి సోషల్ మీడియా విభాగం నుంచి వెలువడ్డాయి. ముఖ్యంగా ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ చాలా వివాదాస్పదమైంది. నోట్ల రద్దు, జీఎస్టీ, రైతు చట్టాలు వీటిపై కేటీఆర్ ట్వీట్ చేయగా. నెటిజన్లు ఆటాడుకున్నారు. అప్పట్లో మీ ప్రభుత్వం వాటికి ఎందుకు మద్దతు తెలిపిందని ఎదురు ప్రశ్నించారు. ఆందోళన ఉద్రిక్తం అవుతున్న కొద్ది రైల్వేస్టేషన్లో పార్సిళ్లు దగ్ధమయ్యాయి. అక్కడ ఉండే వివిధ దుకాణాలు లూటికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఆందోళన కారు ల రూపంలో విద్రోహ శక్తులు నగరం లోకి చొరబడి అల్లర్లు సృష్టిస్తాయని అనుమానంతో పోలీసు బలగాలు కాల్పులకు దిగాయి. అంతకంటే ముందుగానే ఆందోళనకారులను హెచ్చరించాయి. పరిస్థితి ఏ మాత్రం అదుపులోకి రాకపోవడంతో కాల్పులకు దిగడంతో రాకేష్ అనే యువకుడు పోలీసు తూటాలకు నేలకొరిగాడు. సదరు యువకుడు ఆర్మీ ఎన్నికల్లో పాల్గొని పరీక్ష రాసేందుకు ఎదురుచూస్తున్నాడు. కాల్పుల్లో తెలంగాణ యువకుడు మృతి చెందడంతో సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. వెంటనే తన అధికార పార్టీ నాయకులతో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయించారు. తర్వాత తెలంగాణ సీఎంవో పేరుతో రాకేష్ యువకుడి మృతికి సంతాపం తెలియజేస్తూ 25 లక్షల పరిహారం, వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తానని ప్రకటించారు.

Also Read: Center Govt- Agneepath Scheme: అగ్నిపథ్ పై కేంద్రం పీచేముడ్

రేవంత్ ను, బండి సంజయ్ ని ఎందుకు అడ్డుకున్నట్లు?

బాసర త్రిబుల్ ఐటీ లో గత కొద్ది రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వారి సమస్యలు పరిష్కరించకపోగా సర్కార్ వారి హాస్టల్ లో కరెంటు, నీటి సౌకర్యం నిలిపివేసింది. అయినప్పటికీ మండే ఎండలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారిని పరామర్శించేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వేర్వేరుగా బయలుదేరితే మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసి, నిర్బంధించేంత వ్యవస్థ పోలీసుల వద్ద ఉన్నప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి అంత మంది యువకులు కర్రలు, రాడ్లు, రాళ్లతో వస్తున్నప్పుడు ఏం చేశారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక రకంగా తెలంగాణ పోలీసులు, ఇంటెలిజెన్స్ విభాగం ప్రేక్షకపాత్ర వహించడం తోనే ఇంత విధ్వంసం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అంత్యక్రియల్లో టీఆర్ఎస్ ఓవరాక్షన్

రాకేష్ మృతదేహాన్ని నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి వరంగల్ తీసుకువచ్చారు. రాత్రి నుంచే మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, దాస్యం వినయ్ భాస్కర్ రాకేష్ ఇంటి వద్దే ఉన్నారు. శనివారం జరిగిన అంత్యక్రియల్లో వాళ్ళు పాల్గొన్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దపెట్టున మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది మోదీ చేసిన హత్య అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. అంత్యక్రియల్లో భాగంగా పక్కనే ఉన్న బీఎస్ఎన్ఎల్ భవన్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. పోలీసులు నిలువరించడం తో వారికి ఆందోళనకారులకు ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒకరు ఇద్దరు టీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి.

Agnipath KCR Political Weapon
Rakesh

మరి అప్పుడు ఎందుకు పరామర్శించే లేదు

వరంగల్ లో రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి ఇటీవల సర్వే పూర్తి అయింది. ముఖ్యంగా పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాలలో రైతుల భూములు రోడ్డు విస్తరణకు అవసరం పడుతున్నాయి. అయితే ఇందులో పెద్దల భూములు ఉండటంతో అలైన్మెంట్ మార్చి పేద రైతుల భూములను అందులో చేరుస్తున్నారు. ఈ క్రమంలోనే అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అక్కడి రైతులు ఘోరావ్ చేస్తున్నారు. చల్లా ధర్మారెడ్డి ఏకంగా తన భూములు పోకుండా అలైన్మెంట్ మార్చారని ఆరోపణలతో గత కొద్ది రోజులుగా రైతులు అక్కడ వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఆ నిరసనను తగ్గించుకునేందుకు ఇటీవల చల్లా ధర్మారెడ్డి పరకాల నియోజకవర్గం లోని టెక్స్టైల్ పార్క్ లో గార్మెంట్ ఫ్యాక్టరీని మంత్రి కేటీఆర్ తో ప్రారంభించారు. అయినప్పటికీ రైతుల్లో నిరసన భావం తగ్గలేదు. ప్రభుత్వం ఎంత కు దిగి రాకపోవడంతో కొందరు రైతులు పురుగుమందు డబ్బులతో ఆత్మహత్యలకు యత్నించారు. వరంగల్లో ఈ స్థాయిలో ఘర్షణ చెలరేగుతున్నా మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని బాధిత రైతులను పరామర్శించిన పాపాన పోలేదు. కానీ రాకేష్ మృతి చెందగా నే టిఆర్ఎస్ నాయకులు రాజకీయాలకు తెరలేపారు. ప్రగతి భవన్ దర్శకత్వంలోనే ఈ తంతు అంతా జరుగుతోందని ఇక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం బీజేపీ పై యువత ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తుండటంతో దాన్ని ఎలాగైనా మళ్ళించాలని ఉద్దేశంతో రాకేశ్ మరణాన్ని టీఆర్ఎస్ నాయకులు పావుగా వాడుకుంటున్నారని ఆరోపణలు లేకపోలేదు.

Also Read:Agneepath Scheme: అగ్నిపథ్’ అల్లర్లకు చెక్ చెప్పేదెలా? ఇలా చేయాలంటున్న నిపుణులు

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular