Chandrababu Crying: చంద్రబాబు ఏడుపు.. సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు

టీడీపీ అధినేత చంద్రబాబు ఏడుపుపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. నిండు శాసనసభలో తనను, తన భార్యను అవమానించేలా మాట్లాడారని బూతులు తిట్టారని.. మీడియా సమావేశంలో భోరుమన్నాడు. గుక్కపట్టి ఏడ్చేశాడు. ఇప్పుడు ఆ ఏడుపుపై టీడీపీ శ్రేణులు ఆవేదన చెందుతుండగా.. వైసీపీ శ్రేణులు బాబు చేసిన దానికి అనుభవించాడని గతాన్ని తవ్వుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో  సెటైర్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘‘చాలా పెద్ద పెద్ద ఇబ్బందులు, అనేక ఓటములు, ఊహించని కుటుంబ సభ్యుల మరణాలు, […]

Written By: NARESH, Updated On : November 19, 2021 5:06 pm
Follow us on

టీడీపీ అధినేత చంద్రబాబు ఏడుపుపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. నిండు శాసనసభలో తనను, తన భార్యను అవమానించేలా మాట్లాడారని బూతులు తిట్టారని.. మీడియా సమావేశంలో భోరుమన్నాడు. గుక్కపట్టి ఏడ్చేశాడు. ఇప్పుడు ఆ ఏడుపుపై టీడీపీ శ్రేణులు ఆవేదన చెందుతుండగా.. వైసీపీ శ్రేణులు బాబు చేసిన దానికి అనుభవించాడని గతాన్ని తవ్వుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో  సెటైర్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

chandrababu crying

‘‘చాలా పెద్ద పెద్ద ఇబ్బందులు, అనేక ఓటములు, ఊహించని కుటుంబ సభ్యుల మరణాలు, కీలక నేతలు మరణాలు ఇన్ని జరిగినా ఏ రోజూ మీరు ఏడవడం చూడలేదు.. కాసేపు చూసి ఈయన ఏడవడం ఏంటి.. అయ్యో పాపం…. అనుకునే ఆలోచన వచ్చే లోగానే.. మైండ్ లో ఇంకో జ్ఞాపకం వచ్చింది.

కర్మ ఈజ్ ఎ డిచ్ బాబు గారు.. ఒకప్పుడు అయితే నిజం గా ఒక వ్యక్తిగా అయినా మీరు ఏడవడం చూసి బాధపడే వాడిని ఏమో.. కానీ మీరు మా మెగా ఫ్యామిలీ కి చేసిన దుర్మార్గ పూరిత అన్యాయాలు, మీరు అవలంబించిన అణిచివేత, తెగబెట్టిన మానసిక అత్యాచారాలు, మీ మీడియా ద్వారా మాకు చేసిన అవమానాలు గుర్తు చేసుకుంటూ ఈ వీడియో చూస్తే మాత్రం రవ్వంత కూడా బాధ రావడం లేదు.. నిజానికి ఒకింత హాయి గా ఉంది..
మీ భార్య గారు ఒక్కరే భార్య? మిగతా వాళ్ళ భార్యలు మనుషులు కాదా? మానం అభిమానం హుందాతనం ఉండవా? మీదే కుటుంబమా? మీ ఇంట్లో ఆడాల్లే మర్యాదస్తులా?

చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ.. చాలా అంటే చాలా న్యాయం జరిగింది అనిపిస్తుంది. నేను వైసీపీ చేసిన చర్యలను ఏ మాత్రం సపోర్ట్ చేయను… గాని.. మీ లాంటి వాడికి మీరు ఎదుటి వాళ్లకి చేసే పనులు ఇలా బాధ కలిగిస్తాయి అని స్పృహ లోకి వచ్చే రోజు ఈరోజు వచ్చినందుకు దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది..

బాధ పడకండి బాబు గారు.. ఎద్దులా ఉన్నారు.. ఏడిస్తే అసహ్యం గా ఉంటది… తుడుచుకొండి…. ప్లీజ్… ఇకనైనా భూమి గుండ్రంగా ఉంటది.. మనం విసిరిన రాయి మన మీదకే వస్తది అని తెలుసుకుని… హుందాగా రాజకీయాలు నుంచి రిటైర్ అవ్వండి.. ఇంత కన్నా గొప్ప సింపతీ మళ్లీ మళ్లీ ఏడ్చినా రాదు…’’

ఇలా ఎందరో చంద్రబాబుపై కోపాన్ని ఆగ్రహాన్ని బయటపెడుతూ ఆయన ఏడుపులు పెడబొబ్బలను ఎండగడుతున్నారు..