https://oktelugu.com/

 Jai Bhim: గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారానికి నామినేట్‌ అయినా సూర్య ” జై భీమ్‌”  మూవీ…

Jai Bhim: విభిన్నమైన కథను ఎంచుకోవడంలో హీరో సూర్య కి మించినవారు ఉండరనే చెప్పాలి. తన ప్రతి సినిమాలో విభిన్నమైన పాత్రలను నటిస్తూ తమిళ్ తో పాటు తెలుగు ఇండస్ట్రీలో కూడా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు సూర్య. స్టార్ హీరో అయినా ఒక సాదా సీదా అబ్బాయిల వ్యవహరిస్తారు సూర్య. అయితే సూర్య కి బయోపిక్ చిత్రాలు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. “ఆకాశమే నీ హద్దురా” సినిమాతో మంచి విజయం అందుకని ఆ తర్వాత […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 30, 2021 / 01:56 PM IST
    Follow us on

    Jai Bhim: విభిన్నమైన కథను ఎంచుకోవడంలో హీరో సూర్య కి మించినవారు ఉండరనే చెప్పాలి. తన ప్రతి సినిమాలో విభిన్నమైన పాత్రలను నటిస్తూ తమిళ్ తో పాటు తెలుగు ఇండస్ట్రీలో కూడా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు సూర్య. స్టార్ హీరో అయినా ఒక సాదా సీదా అబ్బాయిల వ్యవహరిస్తారు సూర్య. అయితే సూర్య కి బయోపిక్ చిత్రాలు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. “ఆకాశమే నీ హద్దురా” సినిమాతో మంచి విజయం అందుకని ఆ తర్వాత విడుదలైన ” జై భీమ్ ” సినిమాతో ప్రేక్షక ప్రశంసలతో పాటు సెలబ్రెటీ ప్రశంసలు కూడా అందుకున్నారు సూర్య. అయితే “జై భీమ్‌” సినిమా కి మరో ఘనత దక్కింది అనే చెప్పాలి.

    హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘జై భీమ్‌’ ఈ చిత్రానికి జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జ్యోతిక, సూర్య కలిసి నిర్మించారు. ఓటిటి వేదికైన అమెజాన్ ప్రైమ్‌ లో నవంబర్ 2న ఈ సినిమా విడుదలైంది. తమిళనాడులో జరిగిన నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ చిత్రం తెరకెక్కించిన విషయం తెలిసిందే. అలానే ఐఏమ్‌డీబీ‌లో అత్యధికంగా 9.6 రేటింగ్ సాధించి ప్రపంచ రికార్డు సృష్టించింది.

    ఆస్కార్‌ అవార్డు తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ” గోల్డెన్‌ గ్లోబ్‌ ” పురస్కారాన్ని భావిస్తారు. అయితే ఈ క్రమంలో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారానికి నామినేట్‌ అయింది ‘జై భీమ్‌’. వచ్చే ఏడాది జనవరిలో లాస్ ఏంజెల్స్‌ వేదికగా ఈ అవార్డులను అందించనున్నారు. కాగా ‘జై భీమ్‌’ గోల్డెన్ గ్లోబ్‌ అవార్డుకు షార్ట్‌ లిస్ట్‌ కావడంతో సినీ అభిమానులు హీరో సూర్యను అభినందిస్తున్నారు.