https://oktelugu.com/

Good Luck Sakhi Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న గుడ్ లక్ సఖి చిత్రం…

Good Luck Sakhi Movie: నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కీర్తి సురేష్. ఆ తర్వాత వరుస సినిమాలతో తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్. ఆ తర్వాత కీర్తి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అయితే ఆ తర్వాత ఎక్కువగా లేడి ఓరియంటెడ్ చిత్రాలలో నటించింది ఈ భామ. పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 30, 2021 / 01:43 PM IST
    Follow us on

    Good Luck Sakhi Movie: నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కీర్తి సురేష్. ఆ తర్వాత వరుస సినిమాలతో తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్. ఆ తర్వాత కీర్తి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అయితే ఆ తర్వాత ఎక్కువగా లేడి ఓరియంటెడ్ చిత్రాలలో నటించింది ఈ భామ. పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. కాగా ప్రస్తుతం కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం గుడ్ లక్ సఖి. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసారు. దిల్ రాజు సమర్పణలో సుధీర్‌ చంద్ర పదిరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

    Good Luck Sakhi Movie

    ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు టాక్ వచ్చింది. కానీ ఈ సినిమాను మేకర్స్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ వాళ్లు U సర్టిఫికేట్ జారీ చేశారు. ‘గుడ్ లక్ సఖి’ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

    Also Read: అక్కినేని నాగార్జున “బంగార్రాజు” సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే…

    ఇక కీర్తి సురేష్ నటిస్తున్న ఇతర చిత్రాల విషయానికి వస్తే… మహేష్ బాబు హీరోగా వస్తోన్న సర్కారు వారి పాట. ఈ సినిమాకు పరశురామ్ పెట్లా దర్శకుడు. ఈ సినిమా ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ చిరంజీవి సినిమాలో నటిస్తుంది. భోళా శంకర్ అనే సినిమాలో కీర్తి సురేష్, మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న దసరా చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నారు.

    Also Read: రాశీ ఖన్నా కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన “పక్కా కమర్షియల్” మూవీ టీమ్…