Nagarjuna: ఇటీవలే అక్కినేని కుటుంబంలో జరిగిన పలు సంఘటన వలన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే అక్కినేని నాగార్జున టాలీవుడ్ లో కొందరు ప్రముఖులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు తాడేపల్లి లోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో కలిశారు. వీరి సమావేశం దాదాపు గంటపాటు జరిగింది వీళ్ళ సమావేశం అనంతరం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాగ్.

సిఎం జగన్ చూసి చాలా రోజులవుతుంది అని జగన్ తన శ్రేయోభిలాషి అని అక్కినేని నాగార్జున అందుకే విజయవాడ వచ్చానని తెలియజేశారు. సిఎం తో కలిసి లంచ్ చేశామన్నారు. విజయవాడ రావడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు నాగార్జున. నాగార్జున భేటీ అనంతరం గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ కు నాగార్జున బయల్దేరారు. అయితే ఇటీవల ఏపీ సర్కార్ సినిమా పరిశ్రమలో తీసుకున్న నిర్ణయంపై జరిగిన మార్పులకు నాగార్జున సీఎంని భేటీ అయ్యారని అనుకున్నారు. కానీ వ్యక్తిగత అంశాల పైనే సిఎం జగన్మోహన్ రెడ్డితో నాగార్జున మాట్లాడారు అని సీఎంఓ వర్గాలు కూడా తెలిపాయి.
ఇక నాగార్జున సినిమాల విషయానికి వస్తే సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు ప్రిక్వెల్ గా తెరకెక్కుతున్న బంగార్రాజు చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. నాగ్ సరసన రమ్య కృష్ణ, చైతూకి జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. మరో వైపు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ద ఘోస్ట్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు.