గాయపడిన సూర్య.. ఆందోళనలో ఫ్యాన్స్..

తెలుగు, తమిళంలో స్టార్ హీరోగా సూర్య గుర్తింపు తెచ్చుకున్నాడు. సూర్య ప్రతీ మూవీ తమిళంతోపాటు తెలుగులో నేరుగా డబ్ అవుతూ ఉంటాయి. సూర్యకు తమిళంతోపాటు తెలుగులోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులోనూ సూర్య సినిమాలు భారీ కలెక్షన్లు రాబడుతుంటాయి. ‘శివపుత్రుడు’, ‘గజనీ’, ‘సింగం’ సీరిస్ లు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయి.ఇదిలా ఉంటే తాజాగా సూర్య ఇంట్లో వరౌట్లు చేస్తూ గాయపడినట్లు తెలుస్తోంది. సూర్య ఎడమ చేతికి గాయం కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. […]

Written By: Neelambaram, Updated On : May 27, 2020 7:02 pm
Follow us on


తెలుగు, తమిళంలో స్టార్ హీరోగా సూర్య గుర్తింపు తెచ్చుకున్నాడు. సూర్య ప్రతీ మూవీ తమిళంతోపాటు తెలుగులో నేరుగా డబ్ అవుతూ ఉంటాయి. సూర్యకు తమిళంతోపాటు తెలుగులోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులోనూ సూర్య సినిమాలు భారీ కలెక్షన్లు రాబడుతుంటాయి. ‘శివపుత్రుడు’, ‘గజనీ’, ‘సింగం’ సీరిస్ లు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయి.ఇదిలా ఉంటే తాజాగా సూర్య ఇంట్లో వరౌట్లు చేస్తూ గాయపడినట్లు తెలుస్తోంది. సూర్య ఎడమ చేతికి గాయం కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకున్న అనంతరం ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది.

సూర్య గాయపడిన విషయంలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీంతో సూర్య స్పందిస్తూ తనకు పెద్ద గాయమేది కాలేదని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడం గాయం నయమైందని అభిమానులు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని కోరాడు. ప్రస్తుతం సూర్య లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితయ్యాడు. షూటింగులు ప్రారంభం కాగానే హరి దర్శకత్వంలో ‘అరువా’లో నటించనున్నాడు. ఇటీవల సూర్య నిర్మాతగా తన భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో ‘పొన్ మగళ్ వందాళ్’ మూవీని నిర్మించాడు. ఈ మూవీ ఓటీటీలో ఈనెల 29న రిలీజు కానుంది. సూర్య తాజాగా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలోని సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందాయి. లాక్డౌన్ అనంతరం ఈ మూవీని రిలీజు చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.