‘ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారు..?’

గత ఆరు సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తూ వస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అసహనం వ్యక్తం చేశారు. ఈ ఆరు సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు..చెప్పే ధైర్యం ఉందా. కాళేశ్వరం నుంచి ఓక్క చుక్క నీరు రాకపోయినా.. అదనంగా ఒక్క ఎకరానికి నీరు అందించకున్నా..ప్రచారం మాత్రం జోరుగా చేస్తున్నారు. కొండపోచమ్మకు వచ్చేది కాళేశ్వరం నీళ్ళు కాదు, ఎల్లంపల్లి నీళ్లు తెచ్చి కాళేశ్వరం నీళ్లు అని చెపుతారా.. అంటూ పొన్నాల తీవ్ర‌స్థాయిలో ద్వ‌జ‌మెత్తారు. […]

Written By: Neelambaram, Updated On : May 27, 2020 6:58 pm
Follow us on

గత ఆరు సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తూ వస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అసహనం వ్యక్తం చేశారు. ఈ ఆరు సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు..చెప్పే ధైర్యం ఉందా. కాళేశ్వరం నుంచి ఓక్క చుక్క నీరు రాకపోయినా.. అదనంగా ఒక్క ఎకరానికి నీరు అందించకున్నా..ప్రచారం మాత్రం జోరుగా చేస్తున్నారు. కొండపోచమ్మకు వచ్చేది కాళేశ్వరం నీళ్ళు కాదు, ఎల్లంపల్లి నీళ్లు తెచ్చి కాళేశ్వరం నీళ్లు అని చెపుతారా.. అంటూ పొన్నాల తీవ్ర‌స్థాయిలో ద్వ‌జ‌మెత్తారు.

ప్రచారమే పరమావధిగా ఈ రాష్ట్రంలో పాలన జరుగుతుంది. వాస్తవాలను పక్కన పెట్టి ప్రచారానికి పెద్ద పీట వేసారు.ఈ సంవత్సరం లక్షా ఇరవై వేల ఐటీ ఎగుమతులు చేసామని ప్రభుత్వం చెప్తుంది. ఇది గర్వించదగిన విషయమే అయినప్పటికీ. 1992 లో నాలుగు కోట్ల ఎగుమతుల నుంచి 2002వరకు అయిదు వేల కోట్ల ఎగుమతులకు చేరాం. నేను ఐటీ మంత్రి గా ఉన్నప్పుడు 58వేల కోట్ల ఐటీ ఎగుమతులు చేసాం. మా కాలంలో 12 రేట్ల ఐటీ ఎగుమతులు పెరిగాయి .టిఆర్ఎస్ పాలనలో రెండు రేట్లు మాత్రమే ఐటీ ఎగుమతులు పెరిగాయి.

హైదరాబాద్ ఐటీ అభివృద్ధికి మేము ఎం చేసామో చెప్తాం..మీరు చెప్పగలరా..ఆపిల్ తో ఓప్పందం కుదుర్చుకుంది మా ప్రభుత్వమే. ప్రపంచ ఐటీ దిగ్గజాలను హైదరాబాద్ కు తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. హైదరాబాద్ కు ఇంటర్ నేషనల్ ఏయిర్పోట్ తో పాటు ఇంఫ్రాటక్చర్ డెవలప్ చేసి ఐటీ అభివృద్ధి కి దోహదం చేసాం.హైదరాబాద్ మెట్రో తెచ్చింది కాంగ్రెస్.ఈ ఆరు సంవత్సరాలలో ఐటీ అభివృద్ధి కి టిఆర్ఎస్ ఎం చేసిందో చెప్పాలి. విప్రో ,ఇన్ఫోసిస్ ,అమెజాన్ లాంటి ఐటీ దిగ్గజ కంపెనీల సమస్యలు పరిష్కరించి ..ప్రపంచ ఐటీ లో హైదరాబాద్ కు ప్రత్యేక స్థానం తీసుకొచ్చాం.. యానిమేషన్ ,గేమింగ్ కంపెనీల కు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తే.టిఆర్ఎస్ ప్రభుత్వం వాటిని గాలికొదిలేసింది. దేశంలో మొదటి సారిగా ఈ సేవ ను తీసుకొచ్చింది..కాంగ్రెస్ ప్రభుత్వమే..టిఆర్ఎస్ దేశానికి ఆదర్శంగా ఓక్క పని అయినా చేసిందా.

ప్రభుత్వ వెబ్ సైట్లో సమాచారం ఉండట్లేదు.సమాచారాన్ని అప్ డేట్ చేయట్లేదు. కొత్త గా ఓక్క కంపెనికి కూడా స్థలం కేటాయించలేదు.ఇలాంటప్పుడు ఐటీ అభివృద్ధి ఎలా చెందుతుంది. ఐటీ కి ఇవాంకా ను ఫేమ్ చేస్తే..ఐటీ అభివృద్ధి చెందుతుందా..అలా ఆలోచిస్తే అది సంకుచిత ఆలోచన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాజెక్టులకు లక్షా 7వేల కోట్లు కేటాయిస్తే..ఆంధ్రా ,రాయలసీమ కు 90వేల కోట్లే కేటాయించాం. ఇలా చెప్పుకుంటూ పోతే మేము ప్రభుత్వానికి చేసింది చాలా ఉందని.. ఈ కేసీఆర్ సర్కార్ ప్రచారంతోనే ప్రజలను మోసం చేస్తుందని వెల్లడించారు.