https://oktelugu.com/

Actor Srikanth: బాలయ్యకు విలన్ గా అంటే భయమేసింది అంటున్న శ్రీకాంత్…

Actor Srikanth: నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల హీరో శ్రీకాంత్ మేడియాతో ముచ్చటించారు. ఈ సంధర్భంగా అఖండ సినిమాలో తన రోల్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెరీర్ ప్రారంభంలో విలన్‌గా చేశాను, […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 26, 2021 / 11:47 AM IST
    Follow us on

    Actor Srikanth: నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల హీరో శ్రీకాంత్ మేడియాతో ముచ్చటించారు. ఈ సంధర్భంగా అఖండ సినిమాలో తన రోల్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    కెరీర్ ప్రారంభంలో విలన్‌గా చేశాను, సక్సెస్ అయ్యాను అని శ్రీకాంత్ అన్నారు. యుద్దం శరణం అనే సినిమాలో విలన్‌గా చేశాను. బోయపాటి గారు మంచి విలన్ పాత్రను రాస్తాను వేస్తారా? అని అడిగారు. నేను అక్కడి నుంచే వచ్చాను… ఎందుకు చేయను భయ్యా అని అన్నాను. అలా కొన్ని రోజులు ఎదురుచూశాను. అలా ఓ సారి బాలయ్య బాబు అఖండ కోసం విలన్ కారెక్టర్ చెప్పారు. విన్న వెంటనే భయపడ్డాను, వరదరాజులు కారెక్టర్‌కు న్యాయం చేయగలనా అని అనుకున్నాను. ఎందుకంటే బాలయ్య, బోయపాటి సినిమాలో విలన్ అంటే మామూలుగా ఉండదు. ముందు గెటప్ సెట్ అయితే బాగుంటుందని అనుకున్నాం. ఎన్నో రకరకాలుగా ట్రై చేశాం. కానీ సహజంగా, సింపుల్‌గా పెట్టేద్దామని అన్నారు. అలా గడ్డంతో చూసే సరికి నేనేనా అనుకున్నాను అని తెలిపారు. నా గెటప్ చూసి అందరూ ఫోన్లు చేసి ప్రశసించారు. కానీ ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఈ పాత్రకు నేను డబ్బింగ్ చెప్పాను. ఇంకా ఈ సినిమాలో మీకు కొత్త శ్రీకాంత్ కనిపిస్తాడు అని చెప్పారు. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఇటు ఇండస్ట్రీలో అటు ఆడియెన్స్‌లో అంచనాలుంటాయి. ముఖ్యంగా ఇందులో డైలాగ్స్ అద్బుతంగా ఉంటాయి. బాలయ్య గారి దగ్గరి నుంచి ప్రేక్షకులు కోరుకునేదే అది. ఇందులో సెంటిమెంట్ కూడా ప్రధాన పాత్రను పోషిస్తుంది అని శ్రీకాంత్ వెల్లడించారు.