https://oktelugu.com/

Tollywood: బాలయ్య, మహేశ్ బాబు తో క్రేజీ మల్టీస్టారర్… ప్లాన్ చేసిన డైరెక్టర్ ఎవరంటే ?

Tollywood: ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలకు కొదువుండేది కాదు. ఎన్టీఆర్ – ఏఎన్నార్, కృష్ణ – కృష్ణంరాజు, శోభన్ బాబు  తర్వాత తరంలో స్టార్‌డమ్‌ని బట్టి ఎవరికి వాళ్లు సోలోగా సినిమాలు చేస్తూ వచ్చారు తప్ప మల్టీస్టారర్ చిత్రాలు చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు  మారుతున్న కాలానుగుణంగా మన తెలుగు హీరోలు కూడా మారుతున్నారు. టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికే పలు మల్టీస్టారర్ సినిమాలు ఘన విజయాలుగా నిలిచాయి. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 18, 2021 / 06:13 PM IST
    Follow us on

    Tollywood: ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలకు కొదువుండేది కాదు. ఎన్టీఆర్ – ఏఎన్నార్, కృష్ణ – కృష్ణంరాజు, శోభన్ బాబు  తర్వాత తరంలో స్టార్‌డమ్‌ని బట్టి ఎవరికి వాళ్లు సోలోగా సినిమాలు చేస్తూ వచ్చారు తప్ప మల్టీస్టారర్ చిత్రాలు చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు  మారుతున్న కాలానుగుణంగా మన తెలుగు హీరోలు కూడా మారుతున్నారు. టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికే పలు మల్టీస్టారర్ సినిమాలు ఘన విజయాలుగా నిలిచాయి. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల, మసాలా, ఎఫ్ 2, ఇలా పలు సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఇక తాజాగా ‘ఆచార్య’, ‘భీమ్లా నాయక్’ సినిమాలు త్వరలోనే ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అవుతున్నాయి.

    ఇప్పుడలాంటి ఓ క్రేజీ కాంబినేషన్‌కి శ్రీకారం చుట్టబోతున్నారు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ. ‘ఆచార్య’ తర్వాత ఎన్టీఆర్ – కొరటాల కలయికలో ఓ సినిమా ఉంది. దాని తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణతో సినిమా చెయ్యబోతున్నారని, ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని ఇటీవలే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాలో బాలయ్యతో పాటు మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నాడట. బాలయ్యతో పాటు సూపర్‌స్టార్ మహేష్ బాబు కూడా ఈ మూవీలో నటించబోతున్నాదాని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ ఇద్దరు హీరోల ఇమేజ్‌కి తగ్గట్టు కొరటాల బ్రహ్మాండమైన స్క్రిప్ట్ రెడీ చేశారని టాక్ వినిపిస్తుంది. కాగా బాలయ్య నటించిన ‘అఖండ’ డిసెంబర్ 2న, కొరత డైరెక్ట్ చేస్తున్న ‘ఆచార్య’ 2022 ఫిబ్రవరి 4, మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ 2022  ఏప్రిల్ 1న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.