Ram Charan- G20 2023 Summit: వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొనే జీ 20 సదస్సులో పాల్గొనే అరుదైన అవకాశం హీరో రామ్ చరణ్ కి దక్కింది. ఈ మేరకు అధికారిక సమాచారం అందుతుంది. జమ్మూ కాశ్మీర్ వేదికగా జరుగుతున్న ఈ సదస్సులో రామ్ చరణ్ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ జమ్మూ కాశ్మీర్ చేరుకున్నారు. పలు అంశాల మీద మేధావుల సభలో ఆయన మాట్లాడనున్నారు. అలాగే టూరిజం వర్కింగ్ గ్రూప్ మీట్ లో పాల్గొని అంతర్జాతీయ ప్రతినిధులతో మాట్లాడనున్నారు.
ఈ సదస్సుల్లో ఎకో టూరిజం, ఫిల్మ్ టూరిజం మీద ఆయన ప్రసంగించనున్నారని సమాచారం. అలాగే షూటింగ్స్ కి సింగిల్ విండో విధానం, జమ్మూ కాశ్మీర్ తో పాటు ఇండియాలో టూరిజం డెవలప్మెంట్, అనుకూలతలు, అవకాశాలు వంటి పలు విషయాలపై రామ్ చరణ్ తన గళం వినిపించనున్నారట. ఫిల్మ్ స్టార్స్ కి అత్యంత అరుదుగా ప్రపంచ ప్రతినిధుల సదస్సులో ప్రాతినిధ్యం లభిస్తుంది. రామ్ చరణ్ ఆ అవకాశం అందిపుచ్చుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఆయన సాధించిన గ్లోబల్ ఇమేజ్ ఇందుకు దోహదం చేసింది. జీ 20 సదస్సులో పాల్గొనబోతున్న రామ్ చరణ్ పతాక శీర్షికలకు ఎక్కారు.
గత ఏడాది కాలంగా రామ్ చరణ్ జీవితంలో గోల్డెన్ డేస్ నడుస్తున్నాయి. రామ్ చరణ్ వైఫ్ ఉపాసన గర్భం దాల్చారు. కొద్ది రోజుల్లో ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. పదేళ్ల తర్వాత మెగా అభిమానుల నిరీక్షణ ఫలించింది. ఇక ఆర్ ఆర్ ఆర్ తో రామ్ చరణ్ ఇమేజ్ ఎల్లలు దాటింది. ఆయన గ్లోబల్ స్టార్ గా అవతరించారు. ఏకంగా ఆస్కార్ విన్నింగ్ మూవీ హీరోగా అవతరించారు. ఆర్ ఆర్ ఆర్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలిచిన విషయం తెలిసిందే. ఆసరా వేడుకలో రామ్ చరణ్ పాల్గొన్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్నారు. దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేశారని సమాచారం. గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ కి జంటగా కియారా అద్వానీ నటిస్తుంది. అనంతరం బుచ్చిబాబు డైరెక్షన్ లో ఒక చిత్రానికి కమిట్ అయ్యారు. ఇది విలేజ్ స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం.
it is such a beautiful place. It is the best place they chose to have the G20 meeting: GlobalStar Ram Charan in J&K's Srinagar for the third G20 Tourism Working Group#G20Kashmir #G20India #RamCharan #GameChanger #RamCharanForG20Summit pic.twitter.com/ih2pjWw56v
— Chennuru Sumanth Reddy ™ (@SumanthReddy__) May 22, 2023