Actor Rajasekhar: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాల్లో మునిగిన వేళ టాలీవుడ్ హీరో రాజశేఖర్ ఇంట మాత్రం తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి వరదరాజన్ గోపాల్ (93) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా వరదరాజన్ గోపాల్ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ మేరకు వరద రాజన్ ను ఇటీవల హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేర్పించారు. కాగా ఈరోజు సాయంత్రం చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు రాజశేకర్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.

వరద రాజన్ కు మొత్తం ఐదుగురు సంతానం ఉండగా… వారిలో ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హీరో రాజశేఖర్ ఆయనకు రెండో సంతానం కాగా ఆయన తెలుగు పరిశ్రమలో ఉన్న టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. కాగా రాజశేఖర్ సోదర సోదరిమనులంతా పలు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ స్థిరపడ్డారు. కాగా రేపు ఉదయం అనగా ( నవంబర్ 5వ తేదీన ) ఉదయం 6 గంటల 30 నిమిషాలకు వరదరాజన్ గోపాల్ మృతదేహాన్ని చెన్నైకి తీసుకు వెళ్ళనున్నారు. అక్కడే వరదరాజన్ అంత్యక్రియలను నిర్వహించనున్నారు. కాగా ప్రస్తుతం రాజశేఖర్ “శేఖర్” అనే సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.