Priyadarshi: నిర్లక్ష్యంగా సినిమాలు తీస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్పడానికి నిదర్శనం గత నెల విడుదలైన రామ్ చరణ్(Global Star Ram Charan) ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) చిత్రం. సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ గా పిలవబడే శంకర్(Shankar Shanmugham), ఈ సినిమాని బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండానే సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. మూడు గంటల నిడివి ఉన్న సినిమా ఏకంగా 5 గంటలకు పైగా వచ్చిందంటే, ఆయన సరైన బౌండెడ్ స్క్రిప్ట్ తో రామ్ చరణ్ వద్దకు వెళ్లలేదని స్పష్టంగా అర్థం అవుతుంది. ఎంతో మంది పాపులర్ ఆర్టిస్టులతో షూటింగ్ ని చేసి, చివరికి ఎడిటింగ్ లో వాళ్లకు సంబంధించిన సన్నివేశాలన్నీ తొలగించేసాడు. నిర్మాత దిల్ రాజు కి బడ్జెట్ ఏ రేంజ్ లో ఖర్చు అయ్యుంటాడో మీరే ఊహించుకోండి. షూటింగ్ చేసినన్ని రోజులు వాళ్లకు డబ్బులు ఇచ్చాడు, కానీ వాళ్లకు సంబంధించిన సినిమాలు లేవు. ఉదాహరణకు బ్రహ్మానందం(Bramhanandam) ఈ సినిమాలో కేవలం ఒకే ఒక్క సన్నివేశం లో కనిపిస్తాడు.
Also Read: ఎట్టకేలకు ‘బాహుబలి 2 ‘ ని దాటేసిన ‘చావా’..’పుష్ప 2′ ని అందుకోవాలంటే ఇంకా ఎంత గ్రాస్ రావాలో తెలుసా!
రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ‘గేమ్ చేంజర్’ లో మీరు చాలా తక్కువసేపు కనిపించారు, ఇలాంటి క్యారెక్టర్స్ ఎందుకు ఒప్పుకుంటున్నారు అని అడిగితే, నేను ఈ సినిమా కోసం చాలా రోజులు పని చేశాను, నా క్యారక్టర్ చిన్నది కాదు, ఎడిటింగ్ లో మొత్తం లేపేశారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ప్రముఖ నటుడు ప్రియదర్శి(Priyadarshi) కూడా అదే కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ ‘బలగం మూవీ చేస్తున్న సమయంలోనే దిల్ రాజు నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చాడు. అంత పెద్ద ప్రాజెక్ట్ లో అవకాశం రాగానే ఎంతో సంతోషించాను, 25 రోజుల పాటు ఈ సినిమా కోసం నేను పని చేశాను కానీ, నాకు సంబంధించి ఒక్క సన్నివేశం కూడా ఈ చిత్రంలో లేదు. నాకు ఆ విషయంలో అన్యాయం జరిగింది కానీ, చిరంజీవి, రామ్ చరణ్ , శంకర్ గార్లతో పని చేయాలని నాకు ఒక డ్రీం ఉండేది, అది ఈ సినిమా ద్వారా నెరవేరింది. అంత వరకు సంతృప్తి పడ్డాను’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రియదర్శి.
ఇలా ఎంతో మంది నటీనటులకు సంబంధించిన సన్నివేశాలు ఇలాగే గాలిలో కలిసిపోయాయి. ఒక బౌండెడ్ స్క్రిప్ట్ తో ఈ సినిమాని సిద్ధం చేసి ఉండుంటే, ఈరోజు ఇంత దారుణమైన ఫలితాన్ని ఎదురుకోవాల్సి వచ్చేది కాదు. మంచి స్క్రిప్ట్ ని శంకర్ తన పైత్యం తో చెడగొట్టేసాడని దిల్ రాజు కి మనసులో చాలా బాధ ఉందట. అందుకే విడుదల తర్వాత ఆయన ‘గేమ్ చేంజర్’ పేరు ని కూడా ప్రస్తావించడానికి ఇష్టపడలేదు. దీనిపై రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియా లో దిల్ రాజు పై విరుచుకుపడ్డారు. డబ్బులు పోగొట్టుకున్న ఆయనకు తెలుస్తుంది , అభిమానులకు ఏమి తెలుస్తుంది ఆ నొప్పి అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.