Actor Pradeep: ప్రముఖ సీనియర్ నటుడు ప్రదీప్(Pradeep) నిన్న రాత్రి తిరుపతి విమానాశ్రయం లో సృష్టించిన హల్చల్ అంతా ఇంతా కాదు. తాను ప్రయాణించే విమాన సర్వీస్ రద్దు అవ్వడంతో ప్రదీప్ స్పైస్ జెట్ యాజమాన్యం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే నిన్న రాత్రి ఆయన తిరుపతి నుండి హైదరాబాద్ కి వెళ్లేందుకు ఫ్లైట్ రేణిగుంట విమాశ్రయం లో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. సాధారణంగా ఫ్లైట్ ఒకవేళ రద్దు అయితే ముందస్తు సమాచారం అందిస్తూ కస్టమర్ మొబైల్ ఫోన్ కి మెసేజ్ పంపిస్తారు. కానీ అలాంటివేమీ చేయలేదట. అందుకే ప్రదీప్ స్పైస్ జెట్ యాజమాన్యం తో గొడవపడ్డాడు. ఆయన్ని చూసి తోటి ప్రయాణికులు కూడా యాజమాన్యం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
Also Read: అక్షరాలా 10 వేల కోట్లు.. తెలుగోడి సత్తాచాటనున్న మహేష్, రాజమౌళి!
ఇంతకీ ఈ ప్రదీప్ ఎవరో కాదు, F2 మరియు F3 వంటి చిత్రాల్లో ‘అంతేగా..అంతేగా’ అనే డైలాగ్ కొడుతూ ఉంటాడు చూడండి..ఆయనే ఈయన. ఒకప్పుడు ఈయన సినిమాల్లో హీరోగా గొప్పగా రాణించాడు. ఆ తర్వాత సీరియల్ ఆర్టిస్ట్ గా ఒక వెలుగు వెలిగాడు. అయితే కొన్నాళ్ళకు ఆయన మనసు సాఫ్ట్ వేర్ పై మరలింది. సత్యం కంపెనీ లో మ్యానేజర్ గా ఎన్నో ఏళ్ళ పాటు ఉద్యోగం చేసాడు. అంతే కాదు ఇతను మానసిక పరివర్తన క్లాసులు కూడా తీసుకుంటూ ఉంటాడు. ఈయన ప్రసంగాలు యూట్యూబ్ లో చూస్తే చాలు, జీవితం మీద పెద్దగా ఆశలు లేని వాళ్లకు కూడా కొత్త ఆశ కలుగుతుంది. అంత గొప్ప వక్త ఈయన. ఈమధ్య కాలం లోనే ఆయన ‘ఇష్మార్ట్ జోడీ 3’ లో తన భార్య తో కలిసి పాల్గొన్నాడు. ఈ జంటకు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టాప్ 5 వరకు వీళ్లిద్దరు కొనసాగారు.
ఈయన సతీమణి ఇప్పుడు సీరియల్స్ లో కూడా క్యారక్టర్ ఆర్టిస్టు గా కొనసాగుతుంది. కూతురు చిన్నతనం లో టీవీ యాంకర్ గా పని చేసిందట. ఇప్పుడు కొన్ని సినిమాలకు క్రియేటివ్ డైరెక్టర్ గా కూడా పని చేస్తుందట. వీళ్ళ కుటుంబ సమాచారం మొత్తం ఇష్మార్ట్ జోడి సీజన్ 3 లో చూసి తెలుసుకున్నారు ఆడియన్స్. అయితే ఎప్పుడూ ఎంతో ఉల్లాసంగా, శాంతంగా కనిపించే ప్రదీప్ లో ఇంత ఫైర్ దాగి ఉందా అని నిన్నటి ఫ్లైట్ ఎపిసోడ్ చూసిన తర్వాతే ఆడియన్స్ కి తెలిసింది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఆ వీడియో ని మీరు కూడా చూసేయండి.