Ponnambalam Viral Video: సినిమా ఇండస్ట్రీలో నటులుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న సినిమాలను సక్సెస్ ఫుల్ గా నిలపడానికి చాలామంది నటులు వాళ్ళ శాయా శక్తుల ట్రై చేసి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఉన్నప్పుడు చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకునే ప్రయత్నం చేసేవారు. ముఖ్యంగా తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి పొన్నంభలం అనే నటుడు మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.చాలా సినిమాల్లో విలన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. నిజానికి చిరంజీవి హీరోగా వచ్చిన హిట్లర్ (Hitler),ముగ్గురు మొనగాళ్లు (Mugguru Monagallu), ముఠామేస్త్రి (Mutha Mestri) లాంటి సినిమాల్లో తను విలన్ గా నటించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే హిట్లర్ (Hitler) సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవితో ఆయన ఫైటింగ్ చేస్తున్న క్రమంలో ఆయనకు ఫైట్ సీన్ షట్ చేస్తున్నప్పుడే మటన్ తీసుకురమ్మని చెప్పారట. అయితే షూట్ అవుతుందట అప్పటికే మధ్యాహ్నం రెండున్నర టైం అవుతున్న క్రమంలో మటన్ వచ్చిందా? అని అడగ్గా వాళ్ళు ఇంకా రాలేదు అని చెప్పడంతో ఆయన పూర్తిగా అప్సెట్ అయిపో షూటింగ్ ను ఆపేసారట.
దానికి కారణం ఏంటి అంటే ఫైట్ సీన్ చేసేటప్పుడు మటన్ తింటేనే తనకు ఎనర్జీ వస్తుందని అప్పుడైతేనే ఆయన అ ఫైట్ ను డేడికేషన్ తో చేయగలనని ఆకలితో ఉన్నప్పుడు ఆ ఫైట్ సీన్ చేయడానికి తనకి ఆ ఎనర్జీ తనకు రాదని చెప్పారట. అయితే అప్పుడున్న పరిస్థితులను బట్టి అక్కడ మటన్ అవలేబుల్లో లేకపోవడం వల్లే మటన్ రాలేదని ఆ తర్వాత సినిమా యూనిట్ కూడా చాలా వరకు క్లారిటీ అయితే ఇచ్చారు.
Also Read: దిల్ సినిమా కోసం నితిన్ ను అలా తీసుకున్నారా.? సంచలన విషయాన్ని చెప్పిన దిల్ రాజు…
ఇక రీసెంట్ గా ఆయన ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావన తీసుకొచ్చి చెప్పారు. మొత్తానికైతే ఆయన గత కొన్ని రోజుల క్రితం తన రెండు కిడ్నీలు పాడైపోయి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి అతన్ని ఆర్థికంగా ఆదుకొని అతని హెల్త్ ని చక్కబెట్టి మళ్లీ అతన్ని మామూలు మనిషిని చేశాడు.
ఆయన పలు ఇంటర్వ్యూలో కూడా మెగాస్టార్ చిరంజీవి వల్లే తను ఇక్కడ బతుకున్నారని చెప్పడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా అప్పట్లో మంచి విలన్ గా రాణించిన ఆయన ఈ మధ్యకాలంలో సినిమాలు అయితే చేయడం లేదు మరి మరోసారి మంచి అవకాశం వస్తే సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం విశేషం…