Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi: ఏళ్లు గడిచినా చిరంజీవిని వేధిస్తున్న అవమానభారం!

Chiranjeevi: ఏళ్లు గడిచినా చిరంజీవిని వేధిస్తున్న అవమానభారం!

Chiranjeevi: చిరంజీవి జీవితంలో రాజకీయ అరంగేట్రం మాయని మచ్చగా మిగిలిపోయింది. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి స్టార్స్ స్ఫూర్తితో చిరంజీవి సీఎం పీఠం అధిరోహించాలని ఆశపడ్డారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఓ వర్గం ఆశలకు ప్రాణం పొసే ప్రయత్నం చేశారు. భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న చిరంజీవి పాలిటిక్స్ లో చక్రం తిప్పడం ఖాయమని రాజకీయ పండితులు అంచనా వేశారు. అయితే చిరంజీవి రాంగ్ టైం లో ఎంట్రీ ఇచ్చి అబాసుపాలయ్యారు.

Chiranjeevi
Chiranjeevi

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన పట్ల పూర్తి సంతృప్తి తో ఉన్న ప్రజలు 2009 ఎన్నికల్లో మరలా ఆయనకు పట్టం కట్టారు. పార్టీ స్థాపించిన ఏడాది వ్యవధిలో ఎన్నికలకు వెళ్లిన చిరంజీవి 18% ఓట్లతో 18 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నారు. ఓ కొత్త పార్టీకి ఇవి చెప్పుకోదగ్గ సీట్లు అని చెప్పాలి. అయితే చిరంజీవి ఊహించింది వేరు. ముఖ్యమంత్రి కుర్చీనే టార్గెట్ గా ఆయన బరిలో దిగిన నేపథ్యంలో, ఈ ఫలితాలను ఘోర వైఫల్యం గా భావించారు.

ఇక చిరంజీవి రాజకీయ అపరిపక్వత తో పాటు పార్టీలో ఉన్న కొందరు స్వార్థ పరుల చర్యలు దెబ్బతీశాయి. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలు కూడా రాకముందే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి చిరంజీవి మరింత నవ్వుల పాలయ్యారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు విజయం దక్కకపోవడానికి మీడియా కూడా ఓ ప్రధాన కారణమని చిరంజీవి గట్టిగా నమ్ముతున్నారు. ఈ విషయాన్ని ఆయన పలుమార్లు ప్రస్తావించారు.

ఇక ఎన్నికల్లో తన పార్టీ ఓటమికి ఓ వర్గం మీడియా పనిగట్టుకొని పని చేసిందని, తనను తప్పుగా చిత్రీకరించిందని ఆయన అభిప్రాయం. ఇది మరచిపోని పీడ కలలా ఆయనను ఇంకా వెంటాడుతుంది. దానికి తాజా ఉదంతమే ఉదాహరణ. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి… శానిటైజర్ ప్రస్తావన రావడంతో.. ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నారు.

Also Read: Pushpa Movie: పుష్ప అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్.. అదిరిపోయిన పుష్ప ట్రైలర్..

12 ఏళ్ల క్రితం తాను ప్రజా అంకిత యాత్ర చేస్తున్నప్పుడు ఫుడ్ తినడానికి శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకున్నానని, మీడియా మాత్రం ఫ్యాన్స్ కి షేక్ హ్యాండ్ ఇచ్చిన చిరంజీవి చేతులు శుభ్రం చేసుకున్నాడు. ఆయన సాధారణ ప్రజలను, ఫ్యాన్స్ ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారని వరుస కథనాలు ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా శానిటైజర్ వాడాలంటే భయం వేస్తుంది, మీడియా దాన్ని ఎలా చిత్రీకరిస్తుందోనని.. అంటూ అక్కడే ఉన్న మీడియాకు చురకలు వేశాడు. చిరంజీవి లేటెస్ట్ కామెంట్స్ వింటే.. 2009 ఎన్నికల తాలూకు చేదు అనుభవాలను ఆయనను ఇంకా వేదిస్తున్నాయని అర్థమవుతుంది.

Also Read: Megastar: మెగాస్టార్​ ఆల్​టైమ్ రికార్డ్​.. ఒకే నెలలో వరుసగా సెట్స్​పైకి నాలుగు సినిమాలు

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version