MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. ఓవైపు ప్రకాష్ రాజ్ వర్గం..మ రోవైపు మంచు విష్ణు వర్గాలుగా విడిపోయి తలపడుతున్నాయి. ఇప్పటికే ఇరువురు ఎన్నికల కేంద్రం విమర్శలు ప్రతివిమర్శలతో కాక రేపుతున్నారు. గెలిచేందుకు సామధాన భేద దండోపాయాలు ప్రయోగిస్తున్నారు. ప్రకాష్ రాజ్ వైపు మెగా ఫ్యామిలీ అండగా ఉండగా.. ఇటు మంచు విష్ణు సైడ్ నందమూరి, ఇతర చిన్న నటీనటులు గళమెత్తుతున్నారు. ఈ ఇష్యూ ఇప్పుడు లోకల్, నాన్ లోకల్ సమస్యగా మారింది. అందరూ బయటకొచ్చి మాట్లాడుతున్నారు. తాజాగా నటుడు, దర్శకుడు రవిబాబు, మరో నటుడు రాజీవ్ కనకాల బయటకు వచ్చి మంచు విష్ణుకు మద్దతుగా మాట్లాడారు.

ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ వర్గం నుంచి తాజాగా సపోర్టు చేస్తున్న నాగబాబు బయటకొచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మా’ ఎన్నికల్లో (MAA Elections 2021) విజయం సాధించేందుకు కొందరు ఓటుకు రూ.10వేలు ఇస్తున్నారని సినీ నటుడు నాగబాబు విమర్శించారు. ప్రకాష్ రాజ్ భారతీయ నటుడు అని.. ఆయన తెలుగు వాడు కాదని విమర్శించే వాళ్లు సినిమాల కోసం ఎలా కావాలంటరని ప్రశ్నించారు. చిన్న, పెద్ద సినిమా ఏదైనా వాళ్లకు ప్రకాష్ రాజ్ కావాలని అన్నారు.
ఒక్కో సినిమాకు కోటి రూపాయలు తీసుకునే పెద్ద నటుడు ప్రకాష్ రాజ్.. అసోసియేషన్ కోసం కొన్ని సినిమాలు కూడా వదులుకుంటానని ఆయన నాతో చెప్పారని నాగబాబు తెలిపారు. ఆయనను తెలుగువాడు కాదని.. విమర్శించే వాళ్లు తమ సినిమాల కోసం మాత్రం కావాలని పాకులాడుతారని విమర్శించారు.
ఒక్కో ఓటరుకు రూ.10వేలు ఇస్తున్నారని.. కొద్దిరోజుల తర్వాత మరికొంత నగదు ఇస్తామని చెబుతున్నారని నాగబాబు సంచలన ఆరోపణలు చేశారు. మా సభ్యులకు డబ్బు ఆశ చూపిస్తున్నారని విమర్శించారు. మా ప్రతిష్ట దిగజార్చడానికి కొందరు కుట్ర చేస్తున్నారని.. ప్రకాష్ గెలిస్తేనే ‘మా’ కు మనుగడ.. మంచు విష్ణు గెలుపు కోసం కొందరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని.. ప్రకాష్ రాజ్ ను గెలిపించేందుకు నూటికి నూరుశాతం శ్రమిస్తామని నాగబాబు స్పష్టం చేశారు.