Samantha Remuneration: సినిమా పరిశ్రమలో అగ్రశ్రేణి కథానాయికలలో సమంత ఒకరు. అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటి కూడా. ఇటీవల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పిన ఆమె సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె కెరీర్ సజావుగానే కొనసాగుతున్నా పెళ్లి తరువాత కూడా అలాగే ముందుకు నడిచింది. ప్రస్తుతం కూడా ఇదే విధంగా తన నటన ప్రస్థానం కొనసాగిస్తోంది. తనలో ఏ మార్పు రాలేదని సూచించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇటీవల ఓ సినిమా సమంత ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. ఏకంగా రూ.3.50 కోట్లు ఇచ్చేందుకు నిర్మాతలు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికగా సమంత గుర్తింపు పొందుతోంది. సినిమాల ఎంపికలో కూడా వేగం చూపించనున్నట్లు చెబుతోంది. ఇకపై వరుసగా సినిమాలు చేసేందుకు నిర్ణయించుకున్నారు.
శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, డెబ్యూడెంట్ దర్శకత్వంలో నటించేందుకు అంగీకారం తెలిపింది. తన వ్యక్తిగత జీవితం సినిమాలపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. సినిమాల నిర్మాణంలో కొత్త తరహా పాత్రలు ఎంపిక చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.
సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో సామాజిక మాధ్యమాల్లో ఎన్నో కథనాలు వెలువడుతున్నాయి. అక్కినేని లాంటి పెద్ద కుటుంబంతో సంబంధాలు తెంచుకోవడంపై పలు రకాల విమర్శలు వస్తున్నాయి. సమంత తప్పిదాలతోనే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని సమాచారం. సినీ పరిశ్రమలో పలువురు సమంత తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.