2024 Movie: ప్రస్తుత కాలంలో మొబైల్ తో కొందరు వ్యక్తులు అద్భుతాలను సృష్టిస్తున్నారు. చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు మొబైల్స్ వాడకం అధికంగా ఉందని చెప్పాలి. ఫొటోస్, వీడియో కాల్స్ యూట్యూబ్ వీడియోస్, వాట్సాప్ , ఇంస్టాగ్రామ్ అంటూ వినోదకరమైన యాప్స్ ను అధికంగా ఉపయోగిస్తూ ఉంటారు. తాజాగా స్మార్ట్ ఫోన్ తో ఏకంగా సినిమానే తీసి చూపించారు కొందరు ఫిలిం మేకర్స్. ప్రస్తుతం ఆ న్యూస్ వైరల్ గా మారింది.

ఓటిటి వేదికైన డిస్నీ + హాట్ స్టార్ లో వన్‌ప్లస్ 9 ప్రొ మొబైల్ తో “2024” అనే టైటిల్ తో చిత్రాన్ని రూపొందించారు. 2024 అనే పేరుతో రూపొందించిన ఈ ఫీచర్ సినిమా 60 నిమిషాలపాటు సాగే యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రాన్ని వన్‌ప్లస్, విక్రమాదిత్య మోట్‌వానే సంయుక్తంగా తెరకెక్కించారు. తాజాగా ఈ ట్రెయిలర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ట్రెయిలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది.
Also Read: Lakshhya Movie: నాగ శౌర్య ” లక్ష్య ” సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్… ఎప్పుడంటే ?
సినిమా చూసినంత సేపు ఈ చిత్రాన్ని మొబైల్లో చిత్రీకరించారు అన్న ఆలోచన రాదు అంత అద్భుతంగా హెచ్ డి కెమెరాకు తీసిపోకుండా తెరకెక్కించారు మేకర్స్. ఇంకా ఈ సినిమా కథ విషయానికొస్తే … సి -24 అనే ఒక వైరస్ దేశంలో ఒక్కసారిగా విజృంభిస్తుంది. ప్రజలకు ఒక్కొక్కరిగా ఈ వైరస్ బారిన పడుతుంటారు. ఇంతకీ ఈ వైరస్ ఎలా పుట్టింది… దీనిని వారు ఎలా అధిగమించారు. ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందా అన్న ఆసక్తికర కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.
Also Read: RRR Janani Song: అందుకే రాజమౌళిని తోపు అనేది.. ఈ 3 ఆర్ఆర్ఆర్ సీన్స్ వెనుక ఎంత లోతుందో తెలుసా?
