Actor Karthi: తమిళ స్టార్ హీరో కార్తీ కెరీర్ లో సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన సినిమా ‘నా పేరు శివ’. ఆ సినిమాను నిర్మించిన స్టూడియో గ్రీన్ ఇప్పుడు మరో సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతుంది. కార్తీ హీరోగా, క్యాథరిన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ‘నా పేరు శివ 2’ అనే టైటిల్ పెట్టడం విశేషం. ఐతే, టైటిల్ ఇలా పెట్టారు అని, ఇదేదో కొత్త సినిమా అనుకుంటే పొరపాటే.
ఇది పాత సినిమానే. ఆ మధ్య కార్తీ హీరోగా ‘కబాలి’ దర్శకుడు పా.రంజిత్ కాంబినేషన్ లో వచ్చిన ‘మద్రాస్’ అనే సినిమా గుర్తుందా ? ఆ సినిమాకి తెలుగు అనువాద రూపంగా రానుంది ఈ ‘నా పేరు శివ 2’. ‘మద్రాస్’ సినిమా 2014లో విడుదలైంది. అంటే రిలీజ్ అయి దాదాపు ఎనిమిది ఏళ్ళు అవుతుంది. మరి ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత మద్రాస్ సినిమా ఎందుకు డబ్ చేస్తున్నారో ? పాత సినిమాతో లాభాలు పట్టుకుపోదామనే ?
Also Read: చిక్కుల్లో చిరంజీవి “ఆచార్య”… మనోభావాలు దెబ్బతిన్నాయ్ అంటున్న ఆర్ఎంపీ సంఘం ?
పైగా ఈ ‘నా పేరు శివ 2’ సినిమాను థియేటర్ లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నామంటూ నిర్మాత స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా గారు చెప్పుకొచ్చాడు. ఈ డిజిటల్ ప్రపంచంలో పాత సినిమాకి కొత్త టైటిల్ పెట్టి రిలీజ్ చేస్తే వర్కౌట్ అవుతుందా ?, పైగా మద్రాస్ అనే సినిమా గొప్ప సినిమా ఏమి కాదు, ఎదో టైమ్ పాస్ సినిమా. మరి అలాంటి సినిమాని ఇప్పుడు ఎందుకు చూస్తారు ?
పైగా మద్రాస్ సినిమా నేటివిటీ కూడా తెలుగు నేటివిటీకి పూర్తి దూరంగా ఉంటుంది. మద్రాస్ సినిమా పూర్తిగా ‘నార్త్ మద్రాస్’ నేపథ్యంలో సాగే ఒక పొలిటికల్ థ్రిల్లర్ మూవీ. సినిమా కూడా ఏవరేజ్ గానే ఉంటుంది. కానీ కార్తీకి మాత్రం ఈ సినిమా వల్ల చాలా మంచి పేరు వచ్చింది. అలాగే దర్శకుడు పా.రంజిత్ కెరీర్ తొలినాళ్ళల్లో మంచి విజయం సాధించిన చిత్రంగా కూడా ఈ సినిమా నిలిచిపోయింది.
Also Read: నచ్చినట్లు చేసే కదా ఈ పరిస్థితి తెచ్చుకున్నావ్.. హీరో పై సెటైర్లు !