https://oktelugu.com/

Acharya Movie: చిక్కుల్లో చిరంజీవి “ఆచార్య”… మనోభావాలు దెబ్బతిన్నాయ్ అంటున్న ఆర్ఎంపీ సంఘం ?

Acharya Movie: మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న చిత్రం “ఆచార్య”. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌టిస్తుండ‌టంతో మూవీపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. అలానే ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్… చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‏టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మణిశర్మ మరోసారి తన మ్యూజిక్ తో అందరినీ మ్యాజిక్ చేయనున్నారు. ఇప్పటికే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 6, 2022 / 12:16 PM IST
    Follow us on

    Acharya Movie: మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న చిత్రం “ఆచార్య”. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌టిస్తుండ‌టంతో మూవీపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. అలానే ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్… చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‏టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మణిశర్మ మరోసారి తన మ్యూజిక్ తో అందరినీ మ్యాజిక్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, టీజర్లు నెట్టింట ట్రెండింగ్​లో దూసుకెళ్లిపోతున్నాయి.

    ఇటీవలే ఈ సినిమా నుంచి ‘శానా కష్టం…’ అనే ఐటెం సాంగ్ రిలీజ్ అయింది. విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ వ్యూస్ దక్కించుకుంది ఏ పాట. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది. మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులు, రెజీనా అందాలు ఈ సాంగ్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. అయితే తాజాగా ఈ పాటపై పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ పాటలో ఒక లైన్ లో ”ఏడేడో నిమురోచ్చని కుర్రోళ్ళు ఆర్ఎంపీలు అవుతున్నారు” అని ఉంది.

    పాటలోని ఈ లైన్ తమ వృత్తిని అవమానపర్చే విధంగా ఉందని… తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆర్ఎంపీ, పీఎంపీల సంఘం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జనగామ పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. పాట రచయిత, దర్శకులపైన చర్యలు తీసుకోవాలని ఆ సంఘం వారు కోరుతున్నారు. మూవీ లో నుంచి ఈ పాటని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై చిత్ర యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.