వ్యాపారస్తులకు నటుడు అలీ విన్నపం

ఒక పక్క దేశమంతా కూడా భయంకరమైన కరోనా వైరస్ వలన తీవ్రమైన భయాందోళనకు గురవుతున్న సమయంలో వ్యాపారులు అతి తెలివితో నిత్యావసరాలు, కూరగాయల ధరలు అమాంతం పెంచేస్తున్నారు . ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాలోచన్లో ఉన్నారు. అయితే ఈ విషయం ఫై స్పందించిన ప్రముఖ సినీ నటుడు అలీ … వ్యాపారులు డబ్బు సంపాదించడానికి ఇది సరైన సమయం కాదని, ఒకవైపు కరోనా వైరస్ వలన ప్రజలందరూ కూడా ఇప్పటికే భయాందోళనకు గురవుతున్నారని అలాంటి సమయం లో […]

Written By: admin, Updated On : March 26, 2020 2:28 pm
Follow us on

ఒక పక్క దేశమంతా కూడా భయంకరమైన కరోనా వైరస్ వలన తీవ్రమైన భయాందోళనకు గురవుతున్న సమయంలో వ్యాపారులు అతి తెలివితో నిత్యావసరాలు, కూరగాయల ధరలు అమాంతం పెంచేస్తున్నారు . ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాలోచన్లో ఉన్నారు. అయితే ఈ విషయం ఫై స్పందించిన ప్రముఖ సినీ నటుడు అలీ … వ్యాపారులు డబ్బు సంపాదించడానికి ఇది సరైన సమయం కాదని, ఒకవైపు కరోనా వైరస్ వలన ప్రజలందరూ కూడా ఇప్పటికే భయాందోళనకు గురవుతున్నారని అలాంటి సమయం లో వ్యాపారులు మరింతగా ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని విజ్ఞప్తి చేశారు.

అంతేకాకుండా సాధారణ రేట్లకు నిత్యావసరాలను అమ్మి వ్యాపారులు కూడా తమ మానవత్వాన్ని చాటుకోవాలని అలీ వాఖ్యానించారు. కాగా భయంకరమైన కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో, ఆ వైరస్ నివారణకై రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు చెరోక లక్ష రూపాయల విరాళం ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇకపోతే భయంకరమైన కరోనా వైరస్ మన దేశం నుంచి వెళ్లిపోవాలని తాను గత 10 రోజులుగా ఇంట్లోనే నమాజ్ చేస్తున్నానని కూడా అలీ వ్యాఖ్యానించారు. కాగా ప్రజలందరూ కూడా ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు సహకరించాలని, అందరం మూకుమ్మడిగా కరోనాని తరిమికొట్టాలని నటుడు అలీ కోరారు .