Homeక్రైమ్‌Epstein Files Bill Gates: ఎప్ స్టీన్ ఫైల్స్; సంచలన నిజాలు బయటపెట్టిన బిల్ గేట్స్

Epstein Files Bill Gates: ఎప్ స్టీన్ ఫైల్స్; సంచలన నిజాలు బయటపెట్టిన బిల్ గేట్స్

Epstein Files Bill Gates: ఎప్ స్టీన్ ఫైల్స్ అమెరికాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంలో పెద్ద పెద్ద వ్యక్తులు ఉండడంతో రోజుకో తీరుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ట్రంప్ నుంచి బిల్ గేట్స్ ఉండడం రకరకాల ఊహగానాలకు కారణమవుతోంది. ఇంతవరకు ఎవరూ నోరు విప్పలేదు.

ఈ వ్యవహారంలో ఇప్పుడు తొలిసారిగా బిల్ గేట్స్ స్పందించారు. ఎప్ స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో తన పేరు ఉండడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. “ఇదంతా విచారకరమైన వ్యవహారం. నేను క్షమాపణ కోరుతున్నాను. ఆ సందేశాలు నిజం కాదు. అసలు ఈ వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తి ఆలోచన ఎందుకు ఇలా మారిందో అర్థం కావడం లేదు. నన్ను లక్ష్యంగా చేసుకున్నాడా.. అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయని” బిల్ గేట్స్ పేర్కొన్నాడు.

ఎప్ స్టీన్ ఫైల్స్ కు సంబంధించిన వ్యవహారంలో 30 లక్షల పేజీల నివేదికను అమెరికా న్యాయశాఖ ఇటీవల విడుదల చేసింది. ఇందులో బిల్ గేట్స్ ప్రస్తావన కూడా వచ్చింది. ఆయన రష్యన్ దేశానికి సంబంధించిన మహిళలతో లైంగిక సంబంధాలు కొనసాగించాడని.. ఇంకా సుఖ వ్యాధుల బారిన పడ్డాడని అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక ఇదే విషయాలను 2013లో తనకు తాను సొంతంగా రాసుకున్న ఈమెయిల్లో ఎప్ స్టీన్ బయట పెట్టడానికి తెలుస్తోంది. అంతేకాదు సుఖ వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి బిల్ గేట్స్ తన భార్య మిగిలిందా గేట్స్ కు అత్యంత శక్తివంతమైన యాంటి బయోటిక్స్ ఇచ్చేవాడని అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ వ్యవహారం తర్వాత గేట్స్ మిలిందా తో సంబంధాన్ని తెంపుకున్నాడని.. మిలిందా కూడా బిల్ గేట్స్ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పు పట్టిందని అమెరికా మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ బిల్ గేట్స్ స్వయంగా క్షమాపణ చెప్పడం.. విచారణ వ్యక్తం చేయడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version