Rowdy Boys: యాక్షన్ .. రోమాంటిక్ గా కట్ అయిన ‘రౌడ్ బాయ్స్’ ట్రైలర్..!

Rowdy Boys: ‘ఆర్ఆర్ఆర్’ మూవీ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడం చిన్న సినిమాలన్నీ ఈ సీజన్ ను టార్గెట్ చేసినట్లు కన్పిస్తోంది. ఇందులో భాగంగానే మలయాళీ కుట్టీ అనుపమ పరమేశ్వర్ లీడ్ రోల్ లో నటిస్తున్న ‘రౌడీ బాయ్స్’ మూవీ జనవరి 14న థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈమేరకు మూవీ మేకర్స్ ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్ ను అధికారంగా ప్రకటించారు. దీంతో ఈ మూవీ కోసం అనుపమ ఫ్యాన్స్ అత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలోనే ‘రౌడీ […]

Written By: Raghava Rao Gara, Updated On : January 8, 2022 7:49 pm
Follow us on

Rowdy Boys: ‘ఆర్ఆర్ఆర్’ మూవీ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడం చిన్న సినిమాలన్నీ ఈ సీజన్ ను టార్గెట్ చేసినట్లు కన్పిస్తోంది. ఇందులో భాగంగానే మలయాళీ కుట్టీ అనుపమ పరమేశ్వర్ లీడ్ రోల్ లో నటిస్తున్న ‘రౌడీ బాయ్స్’ మూవీ జనవరి 14న థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈమేరకు మూవీ మేకర్స్ ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్ ను అధికారంగా ప్రకటించారు. దీంతో ఈ మూవీ కోసం అనుపమ ఫ్యాన్స్ అత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Rowdy Boys Trailer

ఈక్రమంలోనే ‘రౌడీ బాయ్స్ ’ ట్రైలర్ ను  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు విడుదల చేసి చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 2.25నిమిషాల నిడివితో విడుదలైన ట్రైలర్ ను పరిశీలిస్తే ఈ సినిమా కాలేజీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మూవీగా అర్థమవుతోంది. యూత్ ఫుల్ ఎంటర్ టైన్ గా ‘రౌడీ బాయ్స్’ను దర్శకుడు హర్ష కొనుగోటి తెరకెక్కించారు. ఈ మూవీని శ్రీ వేంకటేశ్వర బ్యానర్లో దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు.

ఒక అమ్మాయి కోసం ప్రేమ రెండు కళాశాలలకు చెందిన విద్యార్థులు నువ్వా.. నేనా అన్నట్లు ఫైట్ చేసుకోవడం.. స్నేహితుల మధ్య చోటు చేసుకునే సరదా సన్నివేశాలు.. గొడవలు.. రోమాన్స్ ను యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు చాలా చక్కగా చూపించారు. ఈ మూవీ ప్రధానంగా అనుపమ చుట్టూ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ మూవీతో నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ట్రైలర్లో దేవీశ్రీ అందించిన బీజీఎం ఓ రేంజులో ఉంది.