Acharya OTT Release: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్య సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే..ఎప్పుడో షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్స్ వల్ల వాయిదా పడుతూ వచ్చింది..దీనితో ఈ సినిమా పై జనాల్లో ఆసక్తి మెల్లిగా తగ్గుతూ వచ్చేసింది..ఆ ప్రభావం అడ్వాన్స్ బుకింగ్స్ మీద కూడా చాలా తీవ్రంగా పడింది..చరిత్ర లో మొట్టమొదటిసారి మెగాస్టార్ సినిమాకి ఇంత తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం..దానికి తోడు వరుసగా రెండు పాన్ ఇండియన్ సినిమాలను జనాలు ఎగబడి చూడడం.. పెద్ద గాప్ లేకుండా ఆచార్య సినిమా రావడం..జనాలు మళ్ళీ డబ్బులు పెట్టి చూసేంత ఆసక్తి ఆచార్య సినిమా కలిగించకపోవడం.. దాని ప్రభావం కావాల్సిన హైప్ ని సొంతం చేసుకోలేకపోయిన ఆచార్య సినిమా పై పడడం తో అడ్వాన్స్ బుకింగ్స్ వీక్ గా జరగడానికి కారణం అని ట్రేడ్ విశ్లేషకుల అంచనా.

కానీ అడ్వాన్స్ బుకింగ్స్ వీక్ గా ఉన్నప్పటికీ..టాక్ వస్తే ఈ సినిమా ప్రభంజనం ని ఎవ్వరు ఆపలేరు అని అనుకున్నారు..కానీ టాక్ కూడా మొదటి ఆట నుండే నెగటివ్ సొంతం చేసుకోవడం తో కలెక్షన్ల పై తీవ్రమైన ప్రభావం పడింది..దీని వల్ల మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలకి కలిపి 50 కోట్ల రూపాయిల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన ఈ సినిమా కేవలం ౩౦ కోట్ల రూపాయిల షేర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది..ఇది చిరంజీవి గారి రేంజ్ వసూళ్లు అయితే అసలు కాదు అనే చెప్పాలి..రెండవ రోజు వసూళ్లు మార్నింగ్ షోస్ నుండే దారుణంగా డౌన్ అయిపోయాయి.
Also Read: Hari Hara Veera Mallu:’వీరమల్లు’ నుంచి క్రేజీ అప్ డేట్.. ఆనందంతో ఊగిపోతున్న ఫ్యాన్స్ !
కానీ మ్యాటినీ షోస్ నుండి కాస్త బుకింగ్స్ ఊపు అందుకోవడం తో రెండవ రోజు వసూళ్లు పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి అని ట్రేడ్ వర్గాల అంచనా..మొత్తం మీద తొలి వీకెండ్ లో 60 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని సొంతం చేసుకోబోతున్న ఈ సినిమా ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందా లేదా అనేది ఇప్పుడు బయ్యర్స్ లో నెలకొన్న ఆందోళన.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా OTT స్ట్రీమింగ్ గురించి సోషల్ మీడియా లో పలు రకాల వార్తలు ఇప్పుడు జోరుగా ప్రచారం అవుతున్నాయి..సినిమాకి నెగటివ్ టాక్ రావడం తో ఈ చిత్రం OTT విడుదల తేదీ కూడా బయటకి రాకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు..సుమారు నాలుగు వారాల వరుకు ఈ సినిమాని OTT లో విడుదల చేసేందుకు వీలు లేదు అని కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు అమెజాన్ ప్రైమ్ తో డీలింగ్ చేసుకున్నారు అట..దీని వల్ల ఆచార్య సినిమాని థియేటర్స్ లో చూడాలి అనుకున్నవాళ్ళు OTT లో వచ్చేస్తుంది కదా , అందులో చూసుకోవచ్చులే అనే ఫీలింగ్ నుండి బయటకి వస్తారు..బాక్స్ ఆఫీస్ మీద కూడా దీని ప్రభావం చాలా తక్కువ ఉండొచ్చు..మేకర్స్ తీసుకున్న ఏ నిర్ణయం ఆచార్య కి ఎంత వరుకు మేలు చేస్తుందో చూడాలి.
Also Read:Playback Movie: అంత గొప్ప సినిమా ఎందుకు హిట్ కాలేదు.. ఇప్పటికీ డౌటే ?