https://oktelugu.com/

Liger: యూఎస్​లో ‘లైగర్’​ షూటింగ్​ పూర్తి.. వరుస అప్డేట్లకు మేకర్స్ సన్నాహాలు​

Liger: డైనమిక్​ డైరెక్టర్​ పూరీ జగన్నాథ్​ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా లైగర్​. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్​ కెరీర్​లో తొలి పాన్​ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. మరోవైపు, ఇస్మార్ట్​ శంకర్​ వంటి సూపర్​ హిట్​ కొట్టిన పూరి జగన్నాథ్ ఈ సినిమాను ప్రెస్టేజ్​గా తీసుకున్నట్లు తెలుస్తోంది. లైగర్​తో ఎలాగైనా బాలీవుడ్​లో జెండా పాతేయాలని విజయ్​తో పాటు, పూరి కూడా ఎంతో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 26, 2021 / 09:10 AM IST
    Follow us on

    Liger: డైనమిక్​ డైరెక్టర్​ పూరీ జగన్నాథ్​ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా లైగర్​. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్​ కెరీర్​లో తొలి పాన్​ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. మరోవైపు, ఇస్మార్ట్​ శంకర్​ వంటి సూపర్​ హిట్​ కొట్టిన పూరి జగన్నాథ్ ఈ సినిమాను ప్రెస్టేజ్​గా తీసుకున్నట్లు తెలుస్తోంది. లైగర్​తో ఎలాగైనా బాలీవుడ్​లో జెండా పాతేయాలని విజయ్​తో పాటు, పూరి కూడా ఎంతో ఆసక్తిగా ఎదురూచూస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే సినిమాను తెరకెక్కిస్తున్నారు పూరి. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రఖ్యాత బాక్సింగ్​ ఛాంపియన్​ మైక్​ టైసన్​ను ఈ సినిమా కోసం బరిలోకి దించారు.

    Liger

    Also Read: బాలయ్యకు విలన్ గా అంటే భయమేసింది అంటున్న శ్రీకాంత్…

    కాగా, ఇటీవలే షూటింగ్​ నిమిత్తం యూఎస్ వెళ్లిన లైగర్ టీమ్​.. అక్కడ షెడ్యూల్​ ముగించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి హీరోయిన్​ అనన్య తన ఇన్​స్టాగ్రామ్​లో తెలిపింది.

    ఈనెల మొదట్లో టీమ్​ లాస్​వెగాస్​ వెళ్లగా.. మైక్​టైసన్​కు సంబంధించిన ఫైట్స్​, మాంటేజ్​ సాంగ్స్​తో పాటు మరిన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే త్వరలోనే విజయ్​ అభిమానులను ఉత్సాహపరిచేలా వరుస అప్​డేట్స్​ రానున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగానే మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.  సెప్టెంబరులోనే ఈ సినిమా విడుదల కావాల్సింది.. కానీ, కరోనా కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు.. అనన్య పాండే ఈ సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టనుంది. కాగా, చార్మి, కరణ్​ జోహార్​, పూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

    Also Read: శివ శంక‌ర్ మాస్ట‌ర్ కు అండగా నేను కూడా అంటున్న హీరో ధ‌నుష్…