https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’లో బెస్ట్ సన్నివేశాలు అవే !

ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరం భీంలా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ఇప్పటికే 80% షూట్ పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రంలో తారక్ – చరణ్ మొదటి సారి కలుసుకునే సన్నివేశాలు ‘ఆర్ఆర్ఆర్’లోనే బెస్ట్ సన్నివేశాలు అని తెలుస్తోంది. కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ ఓ వీరోచిత […]

Written By:
  • admin
  • , Updated On : June 7, 2020 / 08:09 PM IST
    Follow us on


    ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరం భీంలా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ఇప్పటికే 80% షూట్ పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రంలో తారక్ – చరణ్ మొదటి సారి కలుసుకునే సన్నివేశాలు
    ‘ఆర్ఆర్ఆర్’లోనే బెస్ట్ సన్నివేశాలు అని తెలుస్తోంది. కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ ఓ వీరోచిత పోరాటాన్ని ప్రదర్శిస్తోన్న సందర్భంలో.. అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ని చూస్తాడట. అలా భీంని చూసి రాజు అతని పట్ల అమితమైన గౌరవాన్ని పెంచుకుంటాడని, అయితే దాన్ని వ్యక్తపర్చకుండా భీంతో పోటీ పడతాడని సమాచారం.

    ఇక ఈ సినిమాలోనే ఈ సీక్వెన్స్ ఇంట్రస్టింగ్ సీక్వెన్స్ అట. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత జక్కన్న నుండి వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ సరసన ఇద్దరూ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికీ మొదటి హీరోయిన్ గా విదేశీ భామ ‘ఒలివియా మోరిస్’ నటించనుంది. అలాగే రెండో హీరోయిన్ పాత్ర కూడా ఉందట. సినిమాలో ఓ గిరిజన యువతి ఎన్టీఆర్ పాత్రను ప్రేమిస్తోందట. ఆ పాత్రలోనే ఓ బాలీవుడ్ హీరోయిన్ రెండు నిముషాల పాటు కనిపిస్తోందట. మరి ఆ హీరోయిన్ ఎవరో తెలియాలంటే ఇంకా కొత్త కాలం ఎదురుచూడాల్సిందే.

    కాగా ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రీయా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. 2021 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.