సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కలయికలో వస్తోన్న ‘ఆచార్య’ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ‘లాహే లాహే’ సాంగ్ సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా చిరు స్టెప్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. వింటేజ్ చిరు కనబడ్డారనే కాంప్లిమెంట్స్ కూడ విపరీతంగా వచ్చాయి. అందుకే ఈ సాంగ్ పై 25 మిలియన్ల వ్యూస్ కురిశాయి. మొత్తానికి పాట సినిమా విడుదలకు ముందే పెద్ద హిట్టైంది.
ఇక ఆచార్య మార్కెట్ ఫై రోజుకొక పుకారు వినిపిస్తోంది. సినిమాలో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తుండటం, పైగా చరణ్ సరసన పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకోవడంతో ఈ సినిమాకి భారీ మల్టీస్టారర్ అనే క్రెడిట్ కూడా వచ్చి చేరింది. అన్నిటికీ మించి కొరటాల శివ డైరక్షన్ కావడం కూడా మార్కెట్ రేంజ్ ని పెంచింది. అందుకే ఆచార్య మార్కెటింగ్ వ్యవహారం వందల కోట్లు దాటేస్తోందని అంటున్నారు.
ఇప్పటికే మొత్తం 200 కోట్లు దాటేస్తోందని.. ఆంధ్రలో 60 కోట్ల రేషియోలో అమ్మగా, నైజాంలో వరంగల్ శ్రీనుకు 40 నుంచి 45 కోట్ల మధ్యలో కోట్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద ఆచార్య థియేటర్ హక్కులు 150 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా మధ్యలోనే ఆగింది. అయితే వచ్చే నెలలో షూట్ ను తిరిగి స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
కాకపోతే మెగాస్టార్ లేకుండానే ఆచార్య సినిమా షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడట కొరటాల. ఒక ఫైట్ సీక్వెన్స్ ను చరణ్ పై మే 20 నుండి షూట్ చేయాలని కొత్తగా షెడ్యూల్ వేశారు. కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఆ షెడ్యూల్ షూటింగ్ ను జరపాలని.. ఆ తరువాత అనగా జూన్ సెకెండ్ వీక్ నుండి మెగాస్టార్ షూట్ లో పాల్గొంటారని తెలుస్తోంది.