https://oktelugu.com/

Megastar Acharya: హిందీలోకి ఆచార్య.. అధికారిక ప్రకటన రానుంది

Megastar Acharya:  మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అందరూ ఆచార్య సినిమా రిలీజ్ కోసం ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా రిలీజ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాను మెగాస్టార్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హిందీలో భారీ స్థాయిలో ఆచార్యను విడుదల చేయనున్నారు. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రాన్ని నిర్మిస్తున్న రామ్ చరణ్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : April 13, 2022 / 10:47 AM IST
    Follow us on

    Megastar Acharya:  మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అందరూ ఆచార్య సినిమా రిలీజ్ కోసం ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా రిలీజ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాను మెగాస్టార్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హిందీలో భారీ స్థాయిలో ఆచార్యను విడుదల చేయనున్నారు.

    Acharya

    తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రాన్ని నిర్మిస్తున్న రామ్ చరణ్ ఇప్పటికే ఈ విషయంలో తుది నిర్ణయం కూడా తీసుకున్నారట. ఇందుకోసం రామ్ చరణ్ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లతో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే చిరంజీవి ముంబై వెళ్లి ఆచార్య ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని కూడా తెలిసింది. ఇక తెలుగులో ఈ మూవీ ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది.

    Also Read:  అసెంబ్లీ సమావేశాలకు బద్దకమేనా ప్రజాప్రతినిధులూ?

    అయితే హిందీలో కూడా అదే తేదికి విడుదల ఉంటుందా ? లేక, లేటుగా రిలీజ్ అవుతుందా ? అనేది చూడాలి. ఏది ఏమైనా ఈ సినిమాలో మెగాస్టార్ లుక్ మాత్రం అదిరిపోయింది. సినిమాకి మంచి హైప్ క్రియేట్ అయింది. ఇక ఆ మధ్య ఎప్పుడో ఆచార్య నుంచి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియోతో పాటు మెగాస్టార్ స్టైలిష్ మోషన్ పోస్టర్ ను వదిలారు.

    Acharya

    అది కూడా బాగా హిట్ అయ్యింది. కాకపోతే.. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అందరూ ఆచార్య ట్రైలర్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. మరి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

    Also Read: ఆంధ్రలో థియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీ.. టికెట్ల పెంపు కూడా !

    Tags