Ravi Teja Injured: హీరో రవితేజ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తూ ఉండగా సంఘటన చోటు చేసుకుంది. టైగర్ నాగేశ్వరరావు టైటిల్ తో రవితేజ ఓ బయోపిక్ చేస్తున్న విషయం తెలిసింది. స్టువర్ట్ పురానికి చెందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. కొన్నాళ్లుగా ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా చిత్రంగా పలు భాషల్లో విడుదల కానుంది. దొంగాట ఫేమ్ వంశీ ఈ చిత్ర దర్శకుడు.
Ravi Teja
కాగా ఈ సినిమా కోసం ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా రవితేజ ప్రమాదానికి గురయ్యాడు. ఆయన వేలాడుతున్న తాడు పట్టు తప్పడంతో క్రింద పడ్డారట. ఈ ప్రమాదంలో రవితేజకు గాయాలైనట్లు సమాచారం. చర్మం కట్ కావడంతో పది కుట్లు పడ్డాయట. అయినప్పటికీ రవితేజ విశ్రాంతి తీసుకోకుండా చిత్రీకరణలో పాల్గొన్నట్లు సమాచారం. ఇక చిన్న గాయాలతో బయటపడ్డ నేపథ్యంలో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
Also Read: Virata Parvam Movie Review: విరాటపర్వం మూవీ రివ్యూ..
Ravi Teja
రవితేజ ఏక కాలంలో మూడు నాలుగు చిత్రాలు పూర్తి చేస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో పాటు ధమాకా, రావణాసుర, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాల్లో నటిస్తున్నారు. రామారావు ఆన్ డ్యూటీ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా… విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక రవితేజ గత చిత్రం ఖిలాడి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన ఆ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. క్రాక్ మూవీతో రవితేజ భారీ విజయం నమోదు చేశారు.
Also Read:Nayanthara- Vignesh: షాకింగ్.. నయనతార – విఘ్నేశ్ పెళ్ళికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చెయ్యలేదా..!