Homeఎంటర్టైన్మెంట్Mahesh-Rajamouli Movie: మహేష్-రాజమౌళి మూవీ సెట్ అయ్యింది ఎవరి వల్లనో తెలుసా?

Mahesh-Rajamouli Movie: మహేష్-రాజమౌళి మూవీ సెట్ అయ్యింది ఎవరి వల్లనో తెలుసా?

Mahesh-Rajamouli Movie: తెలుగు సినీ పరిశ్రమలో జక్కన్నగా పేరుగాంచిన దర్శకుడు రాజమౌళి. వరుస విజయాలతో ఎక్కడ కూడా అపజయం ఎరుగని ధీరుడు. ఇక హీరోల్లో మహేశ్ బాబుకు ఉన్న క్రేజీ ఏంటో అందరికి తెలుసు. దీంతో జక్కన్న మహేశ్ కాంబినేషన్ లో సినిమా రావాలని ప్రేక్షకులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. కానీ వారి కోరిక మాత్రం తీరడం లేదు. దీంతో వారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమాకు ఇంకా ముహూర్తం కుదరడం లేదు. సమయాభావమో మరే ఇతర కారణాల వల్లనో కానీ వారి సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లడం లేదు. అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నా విధి మాత్రం వారి కలయికకు ముహూర్తం కుదరనీయడం లేదు. ఈ నేపథ్యంలో మహేశ్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.

Mahesh-Rajamouli Movie
Mahesh-Rajamouli

వీరిద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా వంటి సూపర్ హిట్లు వచ్చినా తరువాత వీరి కాంబినేషన్ కుదరలేదు. ప్రస్తుతం ఓ భారీ చిత్రానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా అయిన తరువాత రాజమౌళితో సినిమా ఉంటుందని మహేశ్ ట్వీట్ చేశారు. దీంతో అభిమానుల కల ఇప్పుడే తీరేలా లేదు. దానికి ఇంకా కొంచెం సమయం ఉందని తెలుస్తోంది. గతంలో దుర్గా ఆర్ట్స్ ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించింది. దాని నిర్మాత కేఎల్ నారాయణ రాజమౌళితో ఓ సినిమా చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అది కూడా మహేశ్ బాబుతో చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Virata Parvam Movie Review: విరాటపర్వం మూవీ రివ్యూ..

రాజమౌళి కూడా నారాయణకు మాట ఇచ్చారట. తనతో ఓ సినిమా చేస్తానని చెప్పారట. దీంతో ఇప్పుడు మహేశ్ బాబు సినిమా కేఎల్ నారాయణ నిర్మాతంగా రానుందని సమాచారం. మొత్తానికి కేఎల్ నారాయణ రాజమౌళి, మహేశ్ బాబులను కలిపి సినిమా చేయాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. నారాయణ చొరవతోనే రాజమౌళి, మహేశ్ కాంబినేషన్ అదరగొట్టబోతోందని చెబుతున్నారు. దర్శకధీరుడుగా పేరుపొందిన రాజమౌళి ఏది తీసినా అది సూపర్ హిట్టే

Mahesh-Rajamouli Movie
Mahesh-Rajamouli

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఘనత ఆయనకే సొంతం. ఎంత భారీ బడ్జెట్టయినా అంతకు మించి సంపాదించడంలో రాజమౌళి దిట్ట. అందుకే ఆయనతో సినిమాలు చేసేందుకు ఎవరైనా ముందుకు రావాల్సిందే. ధైర్యం చేయాల్సిందే. ఎంత ఖర్చయినా పెట్టాల్సిందే. సర్కారు వారి పాట హిట్టుతో మంచి జోష్ మీదున్న మహేశ్ వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే త్రివిక్రమ్ తో పాటు రాజమౌళితో చేసేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. మొత్తానికి ఓ క్రేజీ కాంబినేషన్ లో సినిమా రావడానికి ఇంకా సమయం ఉందటంతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Also Read:Ravi Teja Injured: షూటింగ్ సెట్స్ లో రవితేజకు ప్రమాదం… తీవ్ర గాయాలు

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular