Suhas Movie Accident: తమిళ టాప్ డైరెక్టర్ వెట్రిమారన్(Vetrimaaran) నిర్మాణం లో మన టాలీవుడ్ టాప్ కమెడియన్ కమ్ హీరో సుహాస్(Suhaas), సూరి ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘మందాడి'(Mandadi Movie). ఇందులో హీరో గా సూరి నటిస్తుండగా, విలన్ గా సుహాస్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా కొద్దిరోజుల క్రితమే విడుదల చేశారు మేకర్స్. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు ఒక సంఘటన కారణంగా వార్తల్లో నిల్చింది. రీసెంట్ గానే చెన్నై బీచ్ తీరం లో ఈ చిత్రానికి సంబందించిన కొన్ని షాట్స్ ని చిత్రీకరిస్తున్నారు. అయితే ఆ సమయం లో అలల తాకిడి ఎక్కువ ఉండడం వల్ల, సినిమా కి సంబంధించిన టెక్నీకల్ క్రూ సభ్యులు ఉన్నటువంటి పడవ బోల్తా కొట్టింది. దీంతో ఇద్దరు సిబ్బందితో పాటు, ఖరీదైన కెమెరాలు సముద్రం లో పడిపోయాయి.
సిబ్బంది ప్రాణాలకు ఎలాంటి హాని జరగలేదు కానీ, ఆస్తి నష్టం మాత్రం చాలా గట్టిగానే జరిగింది. కెమెరాల విలువ కోటి రూపాయలకు పైగానే ఉంటుందట. అంతే కాదు, అందులో షూట్ చేసిన సన్నివేశాలు చాలా వరకు స్టోరేజ్ చేయలేదట. దీంతో ఇప్పుడు ఆ సన్నివేశాలన్నీ మళ్లీ చిత్రీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సముద్రపు అలలు ఎంతటి నష్టాన్ని తెచ్చిపెట్టిందో చూడండి. అందుకే ఇలాంటి షాట్స్ సెట్స్ లో చెయ్యాలి. ఉదాహరణకు ‘దేవర’ చిత్రాన్ని తీసుకుందాం. ఈ సినిమా మొత్తం సముద్ర వాతావరణం లోనే చిత్రీకరించారు. కానీ ఒక్క షాట్ కూడా నిజమైన సముద్రం వద్దకు వెళ్లి తెరకెక్కించలేదు. అన్నీ లొకేషన్స్ లో ఏర్పాటు చేయబడ్డ సెట్స్ లోనే తీశారు. ఈ చిత్రాన్ని కూడా అలాగే తీసి ఉంటే బాగుండేది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి సరిపోయింది, ఒకవేళ జరిగి ఉండుంటే పరిస్థితి ఏమిటి?, అసలే వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని విధంగా ఉంది ఇప్పుడు. ఇలాంటి సమయం లో సముద్రం వైపు వెళ్లకపోవడమే మంచిది.
ఇక ‘మందాడి’ చిత్రం విషయానికి వస్తే ఈ చిత్రానికి వెట్రిమారన్ సోదరుడు మతి మారన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సముద్ర మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ కమ్ ఎమోషనల్ డ్రామా పై కోలీవుడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి. సుహాస్ ఈ చిత్రం ద్వారా తమిళ ఆడియన్స్ కి పరిచయం కాబోతున్నాడు. కమెడియన్ గా టాలీవుడ్ లో కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత హీరో గా పలు సూపర్ హిట్ సినిమాలల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. అదే విధంగా ఈ సినిమాలో హీరో గా నటిస్తున్న హరి కూడా ఒకప్పుడు సుహాస్ లాగానే కమెడియన్. ఈయన కూడా ఇప్పుడు కోలీవుడ్ లో వరుసగా హీరోగా సినిమాలు చేస్తూ తనకంటూ మంచి మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.