https://oktelugu.com/

అభిజిత్ ను ఇంటి నుంచి పంపించేసిన బిగ్ బాస్?

బిగ్‌బాస్ తెలుగు 4 విజేత ఎవరు అనే విషయం తెలియడానికి ఇంకా రెండు వారాలే గడువు ఉండటంతో… షోలో రోజురోజుకూ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరి నాలుగో సీజన్ ముగింపుకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉందనే టెన్షన్ హౌస్ మేట్స్ లో కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. దాంతో ఈ వారం సీజన్ మొత్తానికి కీలకంగా మారింది. ముఖ్యంగా ఈ వారం ఎలిమినేషన్‌పై అందరి ఆసక్తి నెలకొని ఉన్న తరుణంలో ఈ రోజు అభిజీత్‌ను […]

Written By:
  • admin
  • , Updated On : December 4, 2020 / 03:04 PM IST
    Follow us on


    బిగ్‌బాస్ తెలుగు 4 విజేత ఎవరు అనే విషయం తెలియడానికి ఇంకా రెండు వారాలే గడువు ఉండటంతో… షోలో రోజురోజుకూ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరి నాలుగో సీజన్ ముగింపుకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉందనే టెన్షన్ హౌస్ మేట్స్ లో కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. దాంతో ఈ వారం సీజన్ మొత్తానికి కీలకంగా మారింది. ముఖ్యంగా ఈ వారం ఎలిమినేషన్‌పై అందరి ఆసక్తి నెలకొని ఉన్న తరుణంలో ఈ రోజు అభిజీత్‌ను ఓ విషయంలో బిగ్ బాస్ మందలించాడట. అంతేకాదు, అతడిని హౌస్‌ నుంచి బయటకు పంపి జైల్‌లో పెట్టినట్లు తెలిసింది.

    Also Read: రెడ్ పరిస్థితి ఏంటి ? ఓటీటీలోనా? థియేటర్ లోనా?

    ఓ తప్పు చేయడం వల్లే అభిజిత్ కి ఈ పరిస్థితి ఎదురైందని అంటున్నారు. ఈ నేపథ్యంలో రేస్ టు ఫినాలే టాస్కులో సంచాలకుడిగా విఫలం అయ్యాడా? లేక మరేదైనా టాస్కులో ఓడిపోయాడా? అన్నది సస్పెన్స్‌గా మారింది. మరి నిజంగానే అభిజిత్ ను ఎలిమినేట్ చేశారా.. ? లేక ఇది రూమరా అన్నది ఈ ఆదివారం తేలనుంది. అయితే ఈ సీజన్ విన్నర్ విషయంలో అందరి అంచనా ప్రకారం ఇంటిలో ఉన్న అభిజిత్ మైండ్ గేమ్ ప్లే చేస్తూ కూల్ ఆట ఆడుతున్నాడు కాబట్టి.. కచ్చితంగా ఈ సీజన్ టైటిల్ విన్నర్ అతనే అయ్యే అవకాశం ఉందని మొన్నటివరకు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

    Also Read: సమంత బికినీ షో పై శ్రీ రెడ్డి హాట్ కామెంట్స్ !

    కానీ అనూహ్యంగా అభిజిత్ బిగ్ బాస్ జర్నీ యూటర్న్ తీసుకుని…మొత్తానికి మధ్యలోనే ఎలిమినేట్ అయ్యాడా.. చూడాలి. ఇక బిగ్ బాస్ తన దృష్టిలో టైటిల్ విన్నర్ అంటే.. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ జెన్యూన్ గేమ్ ఆడే వాళ్ళు మాత్రమే అని ఇప్పటికే ఇన్ డైరెక్ట్ గా చెప్పిన సంగతి తెలిసిందే. కాబట్టి బిగ్ బాస్ అంచనా ప్రకారం సొహైల్, అరీయనా ఇద్దరిలో ఒకరు టైటిల్ విన్నర్ అని నెటిజన్లు కామెంట్స్ చేయడం కూడా ఒక్కసారిగా అభి సపోర్టర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్లు అయింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్