Aaradhya Bachchan: విశ్వ సుందరి ఐశ్వర్య రాయి బచ్చన్ అంటే ఇష్టముండని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఆమె అందానికి ప్రపంచం లో ఏ మగాడు అయినా ఫిదా అవ్వాల్సిందే. కేవలం అందం మాత్రమే కాదు నటనలో కూడా ఈమె తన తోటి స్టార్ హీరోయిన్లతో పోలిస్తే ఎంతో బెటర్. కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే అభిషేక్ బచ్చన్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని కొంతకాలం వరకు సినిమాలకు దూరమైనా ఐశ్వర్య రాయ్, మళ్ళీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చి పొన్నియన్ సెల్వన్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇదంతా పక్కన పెడితే ఐశ్వర్యరాయి, అభిషేక్ బచ్చన్ జనాతికి ఆరాధ్య బచ్చన్ అనే కూతురు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అచ్చు గుద్దినట్టు అమ్మ పోలికలతో పుట్టిన ఆరాధ్య బచ్చన్ కి ఇప్పటి నుండే సోషల్ మీడియా లో మంచి ఫ్యాన్స్ ఉన్నారు.
అయితే కొంతమంది దుర్మార్గుల కారణంగా ఆరాధ్య బచ్చన్ నిన్న హై కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే సోషల్ మీడియా లో కొన్ని యూట్యూబ్ చానెల్స్ వ్యూస్ కోసం ఎంతటి దారుణమైన వార్తలను ఈమధ్య ప్రచారం చేస్తున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. బ్రతికి ఉన్న మనుషులను కూడా వాళ్ళ వ్యూస్ కోసం చనిపోయినట్టుగా ప్రకటించి, ఆకర్షణీయమైన THUMBNAILS తో వీడియోలు చేస్తున్నారు. వీటిపై ఆరాధ్య బచ్చన్ అసహనం వ్యక్తం చేస్తూ హై కోర్టు లో పిటీషన్ ని దాఖా చేసింది. ఈ కేసు విచారణ మార్చి 17 వ తారీఖుకి వాయిదా పడింది. ఇదంతా పక్కన పెడితే గతంలో ఆరాధ్య బచ్చన్ ‘ఇకలేరు’ అంటూ పలు యూట్యూబ్ చానెల్స్ వేసిన ఫేక్ వీడియోస్ పై ఆరాధ్య తండ్రి అభిషేక్ బచ్చన్ కోర్టు లో పిటీషన్ దాఖలు చేసాడు. దీనిపై విచారించిన కోర్టు చిన్నారి పైన ఇలాంటి ఫేక్ ప్రచారాలు జరగడం దురదృష్టకరమని, తక్షణమే గూగుల్, యూట్యూబ్ సంబంధిత మాధ్యమాలలో వీటిని తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ఆదేశానుసారం వాటిని తాత్కాలికంగా తొలగించగా, మళ్ళీ కొన్నాళ్ళకు సోషల్ మీడియా లో దర్శనమిచ్చింది. దీంతో ఆరాధ్య బచ్చన్ మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఒక వ్యక్తి గురించి, అది కూడా ఒక చిన్నారి గురించి ఇలాంటి నీచమైన ఫేక్ పోస్టులు క్రియేట్ చేసేవారిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. కేవలం వాటిని సోషల్ మీడియా నుండి తొలగిస్తే సరిపోదు. మళ్ళీ అలాంటి ఫేక్ వార్తలు ప్రచురించాలంటే వణుకు రావాలి, అలాంటి చట్టం వచ్చిన రోజే ఇవన్నీ ఆగుతాయి. లేకుంటే భవిష్యత్తులో ఇంకా ఘోరాలు చూడాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మన ఆంధ్ర ప్రదేశ్ లో కూడా సోషల్ మీడియాలో వచ్చే అసభ్యకరమైన పోస్టులను అరికట్టేందుకు కొత్త చట్టం త్వరలోనే రాబోతున్న సంగతి తెలిసిందే.