Aay Movie Collection: జూనియర్ ఎన్టీయార్ బామ్మర్ది మామూలోడు కాదయ్యో…ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలకు జలక్ ఇచ్చాడుగా…

సినిమా చేయడం ఎంత ముఖ్యమో దానిని సరైన సమయంలో రిలీజ్ చేయడం కూడా అంతే ముఖ్యం...సరైన టైమ్ కి రిలీజ్ చేయలేకపోవడం వల్ల ఆ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రాకపోవచ్చు... అందుకే చాలా మంది దర్శక నిర్మాతలు పండగ సీజన్ల మీద ఫోకస్ చేస్తు ఉంటారు...

Written By: Gopi, Updated On : August 26, 2024 9:03 am

Aay Movie Collection

Follow us on

Aay Movie Collection: సినిమా ఇండస్ట్రీలో ఏదైనా అకేషన్ వస్తుంది అంటే చాలు ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే పండుగ సమయం లో కుటుంబ సభ్యులందరూ ఒకే దగ్గర కలుసుకుంటారు. కాబట్టి వాళ్ళందరూ సినిమా చూడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో ఏదైనా సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే జనాలందరూ ఆ సినిమాలను చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ థియేటర్ కి వస్తారు. అలా సినిమాకి భారీ బజ్ క్రియేట్ అవ్వడమే కాకుండా భారీ వసూళ్లను కూడా రాబడుతుంటాయి. ఇక దానివల్ల సినిమాలు సూపర్ హిట్ గా నిలుస్తూ ఉంటాయి. అందువల్లే చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు అందరూ ఏదైనా ఫెస్టివల్ సీజన్ ని బేస్ చేసుకొని సినిమాలు రెడీ చేస్తూ ఉంటారు. ఇలాంటి క్రమం లోనే ఆగస్టు 15వ తేదీన రవితేజ హీరోగా వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’, అలాగే రామ్ హీరోగా వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలతో పాటుగా నార్నే నితిన్ హీరోగా వచ్చిన ‘ఆయ్ ‘ సినిమా కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక వీటితో పాటుగా తమిళంలో విక్రమ్ హీరోగా వచ్చిన ‘తంగలాన్ ‘ సినిమా కూడా తెలుగులో రిలీజ్ అయింది. ఇక తంగలాన్ సినిమా విషయాన్ని పక్కన పెడితే తెలుగు నుంచి వచ్చిన ఈ మూడు సినిమాల్లో మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ రెండు సినిమాలని తొక్కేస్తూ ఒక కొత్త హీరో అయిన నార్నే నితిన్ హీరోగా వచ్చిన ఆయ్ సినిమా మంచి వసూళ్లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. నిజానికి నార్నే నితిన్ జూనియర్ ఎన్టీయార్ బామ్మర్ది… అయినప్పటికి ఎన్టీయార్ పెద్దగా సపోర్ట్ చేయపోయిన నితిన్ తనకు తాను హీరోగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు…

మొత్తానికైతే సినిమాల్లో కంటెంట్ బాగుంటే ఏ సినిమానైనా సరే ప్రేక్షకులు ఆదరిస్తారు అనడానికి ఆయ్ సినిమాని మనం ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. రవితేజ, రామ్ లాంటి ఎనర్జిటిక్ స్టార్ హీరోలను సైతం బీట్ చేసి ఒక సూపర్ సక్సెస్ ను అందుకొవడం అంటే మామూలు విషయం కాదు…

ఇక మొత్తానికైతే ఇద్దరు స్టార్ హీరోలకు ఒక కుర్ర హీరో తన చిన్న సినిమాతో చెక్ పెట్టాడనే చెప్పాలి. ఇక ఆయ్ సినిమా సక్సెస్ తో మరికొన్ని చిన్న సినిమాలు మంచి కంటెంట్ తో రావడానికి రెడీ అవుతున్నాయి. ఇక ఈ సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తుండటం విశేషం. నిజానికి పెద్ద హీరోల సినిమాలకి ఓపెనింగ్స్ భారీగా వస్తాయి.

కానీ లాంగ్ రన్ లో సినిమా నిలబడాలంటే మాత్రం కంటెంట్ బాగుండాలి. లేకపోతే మాత్రం ఏ హీరో సినిమా అయినా కూడా ప్లాప్ అవ్వాల్సిందే.. ఇక కుర్ర హీరోల సినిమాలకు భారీ ఓపెనింగ్స్ రాకపోయినా కూడా కంటెంట్ బాగుంటే ఆ సినిమాలు భారీ వసూళ్లను సాధిస్తాయి…