https://oktelugu.com/

Krishnashtami 2024: శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ రోజు.. సందర్శించాల్సిన ఆలయాలు ఇవే!

శ్రీకృష్ణుని జన్మస్థలం అయిన బృందావనంలో ఘనంగా జన్మాష్టమి వేడుకలు జరుపుతారు. ఇది ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఉంది. ఇక్కడ పది రోజులకు ముందే వేడుకలు ప్రారంభమవుతాయి. ఇక్కడ ఎన్నో ఫేమస్ ఆలయాలు ఉన్నాయి.

Written By:
  • Neelambaram
  • , Updated On : August 26, 2024 / 08:58 AM IST

    Krishnashtami 2024

    Follow us on

    Krishnashtami 2024: దేశ వ్యాప్తంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కన్నయ్యను పూజించడానికి భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కృష్ణాష్టమి వేడుకలను దేశ వ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. ఆ ప్రదేశాల్లో ఈ వేడుకలను ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుపుతారు. దేశ వ్యాప్తంగా ఎందరో భక్తులు ఈ వేడుకలను చూడటానికి వెళ్తుంటారు. అయితే దేశంలో ఏ ఏ ప్రదేశాల్లో కన్నయ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటారో చూద్దాం.

    బృందావనం(ఉత్తరప్రదేశ్)
    శ్రీకృష్ణుని జన్మస్థలం అయిన బృందావనంలో ఘనంగా జన్మాష్టమి వేడుకలు జరుపుతారు. ఇది ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఉంది. ఇక్కడ పది రోజులకు ముందే వేడుకలు ప్రారంభమవుతాయి. ఇక్కడ ఎన్నో ఫేమస్ ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలను అందమైన పూలతో రకరకాలుగా అలంకరిస్తారు. ఇక్కడ వాతావరణం కృష్ణుడి నామస్మరణంతో నిండి ఉంటుంది. భక్తులతో మథుర కిటకిటలాడుతుంది. ఈ మథురలో ప్రేమ్ మందిర్, బాంకే బిహారీ టెంపుల్ చాలా ఫేమస్. సాధారణ రోజుల్లోనే ఇక్కడ భక్తులు ఫుల్‌గా ఉంటారు. అలాంటిది జన్మాష్టమి రోజు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ ఉండే ప్రేమ్ మందిర్ చూడటానికి రెండు కళ్లు చాలవు. తెల్లటి పాలరాతితో ఉండే చూడటానికి చాలా సుందరంగా ఈ టెంపుల్ ఉంటుంది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 11 ఏళ్లు పట్టిందని సమాచారం.

    ద్వారక(గుజరాత్)
    శ్రీ కృష్ణుడి పుణ్యక్షేత్రాల్లో ద్వారక ముఖ్యమైనది. ఇక్కడ కృష్ణుని పురాతన ఆలయం ఉంది. మథురను విడిచి కృష్ణుడు ద్వారక చేరుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. జన్మాష్టమికి ప్రతి ఏడాది ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ప్రపంచ దేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడకు తరలి వస్తుంటారు.

    పూరి(ఒడిశా)
    పూరిలో జన్మాష్టమి వేడుకలు ముందుగానే ప్రారంభమవుతాయి. ఇక్కడ కృష్ణుడి గురించి తెలుపుతూ ప్రత్యేకంగా కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ గుడి చాలా పురాతనమైనది. దేశంలో పూరి బాగా పాపులర్ ఆలయాల్లో ఒకటి.

    ముంబై(మహారాష్ట్ర)
    శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ముంబైలో దహీ హండీని నిర్వహిస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయినది. ముంబైలో నిర్వహించే దహీ హండీని చూడటానికి ప్రపంచం నుంచి కూడా భక్తులు వస్తుంటారు.

    గురువాయూర్(కేరళ)
    కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఉన్న గురువాయూర్ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కృష్ణుడి బాల రూపాన్ని కొలుస్తారు. ఇక్కడ శ్రీ క‌ృష్ణుడి జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుతారు.

    ఉడిపి(కర్ణాటక)
    ఉడిపిలో ఉన్న కృష్ణుడి ఆలయం ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయంలో ప్రత్యేక ఏంటంటే? కృష్ణుడిని కిటికీ నుంచి దర్శనం చేసుకోవాలి. తన భక్తుడు కనకదాసుడు అలాగే దర్శనం చేసుకున్నారని.. అందుకే అందరూ కూడా ఇలానే దర్శనం చేసుకుంటారట. ఇక్కడ జన్మాష్టమి వేడుకులను అంగరంగ వైభవంగా జరుపుతారు.

    పార్థసారథి(తమిళనాడు)
    చెన్నైలో ఉన్న పార్థసారథి ఆలయం శతాబ్దాల క్రితంది. ఈ ఆలయం 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుతారు.