spot_img
Homeఎంటర్టైన్మెంట్Varunavi heart touching performance: 'ఆట' షోలో వరుణవి హార్ట్ టచింగ్ పెర్ఫార్మన్స్..వెక్కి వెక్కి ఏడ్చేసిన...

Varunavi heart touching performance: ‘ఆట’ షోలో వరుణవి హార్ట్ టచింగ్ పెర్ఫార్మన్స్..వెక్కి వెక్కి ఏడ్చేసిన విష్ణుప్రియ..వీడియో వైరల్!

Varunavi heart touching performance: రీసెంట్ గానే జీ తెలుగు ఛానల్ లో మొదలైన ‘ఆట'(Aata Dance Show) డ్యాన్స్ రియాలిటీ షోకి ఆడియన్స్ నుండి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ కి దాదాపుగా 4.89 TVR రేటింగ్స్ వచ్చాయట. ఇది సాధారణమైన విషయం కాదు. ఈ షో కి నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘కమిటీ కుర్రాళ్ళు’ చిత్రం తో నిర్మాతగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న నిహారిక , ఇప్పుడు ఈ అతి పెద్ద డ్యాన్స్ షో తో మరోసారి నిర్మాతగా గ్రాండ్ సక్సెస్ ని చూసింది. ఈ షో లో పాల్గొనే కంటెస్టెంట్స్ కూడా అద్భుతంగా డ్యాన్స్ వీస్తుండడం తో అదే గ్రాండ్ లాంచ్ లో వచ్చిన రేటింగ్స్ , మామూలు ఎపిసోడ్స్ కి కూడా వస్తున్నాయి .

ముఖ్యంగా సుడిగాలి సుధీర్ హోస్టింగ్ ఈ షోకి అతి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆయన మార్క్ వింటేజ్ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. అయితే గత వారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్స్ లో ‘డ్రామా జూనియర్స్’ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న ఇరియా ని తీసుకొచ్చారు . ఈ చిన్నారి ఆ ఎపిసోడ్ లో చేసిన అల్లరి బాగా హైలైట్ అయ్యింది . ఇకపోతే ఈ వారం టెలికాస్ట్ అవ్వబోయే ఎపిసోడ్స్ లో ‘వరుణవి ‘ వచ్చింది. ఈ చిన్నారి కి బుల్లితెర ఆడియన్స్ లో మామూలు క్రేజ్ లేదు. పుట్టుక తోనే అంధురాలైన ఈ చిన్నారి మాట్లాడే ముద్దు ముద్దు మాటలు మనమంతా గత ఎంటర్టైన్మెంట్ షోస్ లో చూశాము . మెగాస్టార్ చిరంజీవి ని కూడా ఈ చిన్నారి కలిసి , ఆయనతో సరదాగా గడిపిన క్షణాలు ఎంత హైలైట్ గా మారిందో అందరికీ తెలిసిందే .

ఇప్పుడు ‘ఆట’ షోలో కూడా ఆమె అదే రేంజ్ లో సందడి చేసింది. షో లోకి అడుగుపెట్టగానే డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన ఈ చిన్నారి , ఆ తర్వాత సుడిగాలి సుధీర్ మీద వేసిన పంచులు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. వరుణవి రాగానే సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ ‘ఎంత అందంగా ఉన్నావో తెలుసా , దిష్టి చుక్క పెట్టుకోవచ్చు కదా’ అని అంటాడు . అప్పుడు వరుణవి ‘సుధీర్ అంకుల్ ఉన్నాడు కదా’ అని అంటుంది. అప్పుడు సుధీర్ ‘అంటే నేను దిష్టి చుక్కనా ?’ అని అనగా , వరుణవి ‘అవును..కరెక్ట్ సమాధానం’ అని అంటుంది . అలా సుధీర్ మీద పంచులు వేసిన తర్వాత ‘ఫీల్ అయ్యుంటే క్షమించి మామా ‘ అని అంటుంది వరుణవి , అప్పుడు సుధీర్ ‘అయ్యో ఎందుకు అమ్మా..మేనకోడలు ఎక్కడైనా క్షమాపణలు చెప్తుందా ‘ అని అంటాడు. ఆ తర్వాత స్టేజి మీదకు వచ్చి సుధీర్ ఈ చిన్నారిని దగ్గరకు తీసుకొని ఆడించిన విధానం చూసే ప్రతీ ఒక్కరికి కంటతడి పెట్టించింది. ముఖ్యంగా ఆ షో లో టీం లీడ్స్ గా కొనసాగుతున్న సమీరా భరద్వాజ్ , విష్ణు ప్రియ వంటి వారు కంటతడి పెట్టుకున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ ప్రోమో వీడియో ని మీరు కూడా చూసేయండి.
Varunavi Emotional Packed Performance | Aata Promo | Sat & Sun 9 PM | Zee Telugu

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...

Nagababu Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్...

Nagababu Jabardasth: గత 13 సంవత్సరాల నుండి ఎలాంటి విరామం లేకుండా ఈటీవీ లో దిగ్విజయంగా సాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది 'జబర్దస్త్' మాత్రమే. ఈ బిగ్గెస్ట్...
Oktelugu Epaper
Exit mobile version