Aata Sandeep: బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొందరి లైఫ్ మారితే మరికొందరు లైఫ్ దారుణంగా మారుతుంది. ఇక ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత చాలా మంది ఇంటర్య్వూలు ఇస్తుంటారు. ఇప్పుడు ఆట సందీప్ కూడా అదే పనిలో ఉన్నాడు. బిగ్ బాస్ ఇంట్లో ఉండి సరదాగా ఉన్న సందీప్ నామినేషన్ లోకి వచ్చి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు వరుస ఇంటర్వ్యూలతో బిజీ అవుతూ షాకింగ్ విషయాలను వెల్లడిస్తున్నాడు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాలు కూడా బయటపెడుతున్నాడు సందీప్. మరి అవేంటో చూసేద్దాం..
డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ లో యాక్టర్, డైరెక్టర్ కూడా ఉంటాడని తెలిపారు సందీప్. డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్, ఫైట్ మాస్టర్స్ డైరెక్టర్ తో సంబంధం లేకుండా చేయగలమని తెలిపాడు ఈ మాస్టర్. అయితే ప్రస్తుతం ఒకటే చేయాలని లిమిట్స్ పెట్టుకుంటే ఎదగడం కష్టం అన్నారు. మూడు సినిమాలకు అవకాశాలు వస్తే వాటిని పూర్తి చేశానని తెలిపాడు. అంతేకాదు తెలుగుతో పాటు కన్నడ సినిమాలకు కూడా పని చేశాడట సందీప్. ఇక కొరియోగ్రఫర్స్ లో జోడీ అంటే నేను జ్యోతి మాత్రమే అన్నాడు ఈ కొరియోగ్రఫర్.
అయితే వీరి జోడీని జనాలు ఇష్టపడుతారని.. జ్యోతి తన కంటెస్టెంట్ అని తెలిపారు. నర్తనశాల అనే షో సమయంలో ఇష్టం ఏర్పడి పెళ్లి చేసుకుంటా అని చెబితే ఒకే అనిందట. ఇక వీరికి ఒక బాబు ఉన్నాడట. మరో కిడ్ కి ప్లాన్ చేస్తున్నారా అని ప్రశ్నిస్తే.. భవిష్యత్తులో చేస్తామని అన్నారు. కెరీర్ లో మరింత కష్టపడి ఎదగాలని అనుకుంటున్నారట. ఇక ఈయన చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంతే కాదు ఈయన మరిన్ని విజయాలు అందుకుంటూ ముందుకు వెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు.