https://oktelugu.com/

Aamir Khan and Allu Arjun : నేషనల్ అవార్డు అల్లు అర్జున్ కంటే ఆ స్టార్ హీరోకి ఇచ్చి ఉంటే బాగుండేది కదా అంటున్న అమీర్ ఖాన్…ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన పుష్ప 2 సినిమా ఇప్పుడు 1800 కోట్ల కలెక్షన్స్ ను సాధించి ముందుకు దూసుకెళ్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : December 28, 2024 / 09:26 AM IST

    Aamir Khan , Allu Arjun

    Follow us on

    Aamir Khan and Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన పుష్ప 2 సినిమా ఇప్పుడు 1800 కోట్ల కలెక్షన్స్ ను సాధించి ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇదిలా ఉంటే ఇంతకు ముందు ఆయన చేసిన పుష్ప మొదటి పార్ట్ భారీ విజయాన్ని సాధించడంతో ఆయనకి ఎనలేని గుర్తింపు రావడమే కాకుండా భారీ కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఈ సినిమాకి దాదాపు 450 కోట్లకు పైన కలెక్షన్స్ రావడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ ను మెచ్చుకున్నారు. అతనికి ‘నేషనల్ అవార్డు’ కూడా వరించింది.

    తెలుగులో ఇప్పటి వర్కు ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న హీరో అల్లు అర్జున్…ప్రస్తుతం ఈయన మీద బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న అమీర్ ఖాన్ కొన్ని కామెంట్స్ అయితే చేశాడు. నిజానికి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే బాగుంది. కానీ అతనికి నేషనల్ అవార్డు రావడం తనకు సర్ప్రైజింగ్ గా అనిపించిందని చెప్పాడు… అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి అమీర్ ఖాన్ సినిమా అవార్డుల ఫంక్షన్ కి చాలా దూరంగా ఉంటున్నాడనే విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో వచ్చే అవార్డులన్నీ కలెక్షన్స్ తో ముడిపడి ఉంటాయని ఏ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తే ఆ సినిమాకు మాత్రమే నేషనల్ అవార్డులను ఇస్తున్నారంటూ ఆయన కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. కాబట్టి ఆ సినిమా హీరో అయిన అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు ఇచ్చారు. కానీ ‘సర్దార్ ఉద్దమ్ ‘ సినిమాలో విక్కీ కౌశల్ చేసిన క్యారెక్టర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆయన పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అతనికి నేషనల్ అవార్డ్ ఇవ్వచ్చు కదా.. నేషనల్ అవార్డుని ఇవ్వడం కూడా కలెక్షన్స్ తో ముడి పెడితే ఎలా ప్రేక్షకుల అభిరుచి మేరకు, వాళ్ళ అభిప్రాయాల మేరకు ఆర్ట్ సినిమాలను కూడా గౌరవించాలి. ఎవరైతే బాగా నటిస్తారో వాళ్లకు మాత్రమే అవార్డు ఇవ్వాలి. అంతే తప్ప భారీ కలెక్షన్స్ వచ్చిన సినిమాల హీరోలకు మాత్రమే నేషనల్ అవార్డు ఇవ్వడం అనేది సరైనది కాదు అంటూ ఆయన కొన్ని కామెంట్స్ చేసినట్టుగా బాలీవుడ్ మీడియా కోడైకొస్తుంది…

    మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు అల్లు అర్జున్ మీద కొంతవరకు నెగెటివిటీ నడుస్తున్న క్రమంలో అమీర్ ఖాన్ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశాడు. మన తెలుగు వాళ్లకు అవార్డులు రావడం పట్ల ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడా? ఇప్పటివరకు ఏ తెలుగు హీరోకి కూడా నేషనల్ అవార్డు అయితే రాలేదు.

    మరి మొదటి సారి తెలుగు సినిమా ఇండస్ట్రీకి నేషనల్ అవార్డు తీసుకొచ్చిన హీరోగా అల్లు అర్జున్ ను అందరూ కీర్తిస్తుంటే ఈ బాలీవుడ్ హీరో మాత్రం అతని మీద నెగిటివ్ కామెంట్లు చేయడం తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులను సైతం కొంతవరకు ఇబ్బందికి గురిచేస్తుందనే చెప్పాలి.

    ఇక మనకు నేషనల్ అవార్డు రావడం పట్ల అమీర్ ఖాన్ విషాన్ని కక్కుతున్నాడు అంటూ మరి కొంతమంది సినిమా పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేయడం విశేషం…