Mahesh-Rajamouli Movie: మహేష్ – రాజమౌళి సినిమాలో అమీర్ ఖాన్.. ఇది కదా అసలు సిసలు కాంబినేషన్ అంటే!

అంత పెద్ద హీరో మహేష్ చిత్రం లో విలన్ గా చెయ్యడానికి ఒప్పుకుంటాడా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.అయితే మన రాజమౌళి ఏ సినిమా తీసిన పాన్ వరల్డ్ రేంజ్ లోనే ఉంటుంది. హాలీవుడ్ లో కూడా ఆయన సినిమాలు ఇక నుండి విడుదల అవుతాయి. అంత పెద్ద రీచ్ ఉన్న సినిమాలో విలన్ గా చెయ్యడానికి ఎలాంటి అభ్యంతరం ఉండక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి అమీర్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.

Written By: Vicky, Updated On : June 6, 2023 4:14 pm

Mahesh-Rajamouli Movie

Follow us on

Mahesh-Rajamouli Movie దర్శక ధీరుడు రాజమౌళి #RRR చిత్రం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. యాక్షన్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కబోతున్న సినిమాని హాలీవుడ్ సినిమాలను మించే ప్రొడక్షన్ విలువలతో తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో బిజీ గా ఉన్నాడు రాజమౌళి. త్వరలోనే ఆయన వర్క్ షాప్ ని నిర్వహించనున్నాడు.

కేవలం ఈ వర్క్ షాప్ సుమారుగా ఆరు నెలలు ఉంటుందని సమాచారం. ఈ వర్క్ షాప్ ప్రారంభం అయ్యే ముందే మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రాన్ని పూర్తి చెయ్యబోతున్నాడు. ఇది ఇలా ఉండగా ఈ వర్క్ షాప్ ప్రారంభం అయ్యే ముందే రాజమౌళి క్యాస్టింగ్ మొత్తాన్ని ఖరారు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు హాలీవుడ్ యాక్టర్స్ ని ఈ సినిమా కోసం సంప్రదించారు. వాళ్ళు ఇందులో నటించడానికి సుముఖం కూడా ఉన్నట్టు తెలుస్తుంది.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా మెయిన్ విలన్ పాత్ర కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ని సంప్రదించాడట రాజమౌళి. అంతే కాదు హీరోయిన్ పాత్ర కోసం దీపికా పడుకొనే ని కూడా అడుగుతున్నారట. అమీర్ ఖాన్ బాలీవుడ్ లో ఎంత పెద్ద సూపర్ స్టార్ అనే విషయం అందరికీ తెలిసిందే. అప్పుడెప్పుడో దంగల్ తో ఆయన సృష్టించిన రికార్డ్స్ ని బాలీవుడ్ హీరోలు మొన్నటి వరకు అందుకోలేదు. షారుఖ్ ఖాన్ రీసెంట్ గా పఠాన్ చిత్రం తో ఆ వసూళ్లను అందుకున్నాడు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు అమీర్ ఖాన్ స్టార్ స్టేటస్ ఎలాంటిది అనేది.