Adipurush New Poster: రాముని రాక కోసం కన్నీరు కారుస్తున్న సీత… ఆదిపురుష్ నుండి అదిరిపోయే అప్డేట్!

అపహరణకు గురైన సీత రాముని రాక కోసం ఎదురుచూస్తూ కన్నీరు కారుస్తున్న మోషన్ పోస్టర్ మనసులకు హత్తుకుంది. లేటెస్ట్ లుక్ చూశాక సీతగా కృతి సనన్ బెస్ట్ ఛాయిస్ అనిపిస్తున్నారు.

Written By: Shiva, Updated On : April 29, 2023 10:20 am
Follow us on

Adipurush New Poster: ఆదిపురుష్ మూవీ మీద హైప్ లేదు. ఒక్క టీజర్ తో ఆ సినిమా మీద ఎక్కడలేని నెగిటివిటీ వచ్చిపడింది. టీజర్లో ప్రధాన పాత్రల గెటప్స్, విజువల్స్ జనాలకు నచ్చలేదు. వందల కోట్ల ప్రాజెక్ట్ కార్టూన్ మూవీని తలపిస్తుందన్న విమర్శలు వినిపించాయి. ఇక రావణాసురుడు, హనుమంతుడు గెటప్స్ విమర్శల పాలయ్యాయి. ఓం రౌత్ కి అసలు రామాయణం తెలుసా? సెంటిమెంట్ తో కూడా చిత్రాన్ని తెరకెక్కించేది ఇంతేనా? అని విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ గెటప్ పై వ్యతిరేకత వ్యక్తమైంది. రావణుడు శివ భక్తుడు. మీకు ఇష్టం వచ్చినట్టు చూపిస్తారా అని ఓం రౌత్ కి వార్నింగ్స్ ఇచ్చారు.

బీజేపీ నాయకులు, హిందూ వర్గాలు ఆదిపురుష్ చిత్రాన్ని అడ్డుకుంటామని జారీ చేశారు. అయితే ఈ నెగిటివిటీ ని పూర్తిగా తొలగించే ప్రయత్నంలో చిత్ర యూనిట్ ఉంది. వరుస అప్డేట్స్ తో హైప్ పెంచుతున్నారు. ఈ మధ్య ఆదిపురుష్ నుండి వస్తున్న మోషన్ పోస్టర్స్ ఆసక్తి రేపుతున్నాయి. నేడు మరో అప్డేట్ ఇచ్చారు. సీత పాత్రను హైలెట్ చేస్తూ మోషన్ పోస్టర్ విడుదల చేశారు.

అపహరణకు గురైన సీత రాముని రాక కోసం ఎదురుచూస్తూ కన్నీరు కారుస్తున్న మోషన్ పోస్టర్ మనసులకు హత్తుకుంది. లేటెస్ట్ లుక్ చూశాక సీతగా కృతి సనన్ బెస్ట్ ఛాయిస్ అనిపిస్తున్నారు. ఆమె ముఖంలో వేదన, నిరీక్షణ అద్భుతంగా పలికాయి. లేటెస్ట్ అప్డేట్స్ తో ఆదిపురుష్ విజయం సాధిస్తుందన్న నమ్మకాలు పెరిగాయి.

ఆదిపురుష్ ట్రైలర్ కట్ కూడా ముగిసిందట. ట్రైలర్ అద్భుతంగా వచ్చిందని పరిశ్రమ వర్గాల వాదన. ప్రభాస్ అవుట్ ఫుట్ పట్ల సంతోషంగా ఉన్నారట. త్వరలో ఆదిపురుష్ ట్రైలర్ భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఆదిపురుష్ జూన్ 16న వరల్డ్ వైడ్ భారీగా విడుదల చేస్తున్నారు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కి హిట్ లేదు. ఆదిపురుష్ మూవీతో ఆయన సక్సెస్ ట్రాక్ ఎక్కే సూచనలు కనిపిస్తున్నాయి కాగా ఇదే ఏడాది ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సైతం విడుదల కానుంది. 2024 సంక్రాంతికి ప్రాజెక్ట్ కే విడుదల అవుతుంది.