https://oktelugu.com/

Adipurush Records: మొదలైన ఆదిపురుష్ రికార్డ్స్… ఆ విషయంలో ఆర్ ఆర్ ఆర్ తో పోటీపడుతున్న ప్రభాస్

వన్ మిలియన్ ఇంట్రెస్ట్స్ తో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ 1.75 మిలియన్ ఇంట్రెస్ట్స్ తో మొదటి స్థానంలో ఉంది. తర్వాత స్థానంలో ఆదిపురుష్ కొనసాగుతుంది.

Written By:
  • Shiva
  • , Updated On : June 16, 2023 10:50 am
    Adipurush Records

    Adipurush Records

    Follow us on

    Adipurush Records: ఆదిపురుష్ మూవీ రికార్డ్స్ అప్పుడే మొదలయ్యాయి. వరల్డ్ వైడ్ ఆదిపురుష్ రికార్డు స్థాయి థియేటర్స్ లో విడుదల చేశారు. సినిమాకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో అత్యధిక థియేటర్స్ లో ఆదిపురుష్ ప్రదర్శిస్తున్నారు. కాగా ఆదిపురుష్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపింది. తెలుగుతో పాటు నార్త్ ఇండియాలో కూడా ఆదిపురుష్ చిత్రానికి విశేష స్పందన దక్కుతుంది. కాగా ప్రముఖ టికెట్ బుకింగ్ ఫ్లాట్ ఫార్మ్ బుక్ మై షోలో ఆదిపురుష్ అరుదైన రికార్డ్ నెలకొల్పింది.

    వన్ మిలియన్ ఇంట్రెస్ట్స్ తో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ 1.75 మిలియన్ ఇంట్రెస్ట్స్ తో మొదటి స్థానంలో ఉంది. తర్వాత స్థానంలో ఆదిపురుష్ కొనసాగుతుంది. ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఎంతటి ఆసక్తి ఉందో చెప్పేందుకు ఇది నిదర్శనం. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ ఆదిపురుష్ భారీ ఓపెనింగ్ ఫిగర్ సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. పలు పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఆదిపురుష్ చిత్రానికి మద్దతుగా నిలుస్తున్నారు. ప్రోమోట్ చేస్తున్నారు.

    కాగా ఆదిపురుష్ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. స్క్రీన్ ప్లే, నటుల పెర్ఫార్మన్స్ అద్భుతం అంటున్నారు. అయితే విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. పూర్తిగా తీర్చిదిద్దకుండానే విడుదల చేశారనే మాట వినిపిస్తోంది. హాఫ్ బేక్డ్ విజువల్స్ అన్న మాట వినిపిస్తుంది. రామునిగా ప్రభాస్ మెప్పించారు. రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ లుక్ విమర్శల పాలవుతుంది.

    కెరీర్లో మొదటిసారి ప్రభాస్ పౌరాణికగాథ చేశారు. ఐకానిక్ రాముని పాత్రలో నటించారు. ఇక జానకిగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ చేశారు. దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కించారు. భూషణ్ కుమార్ టి సిరీస్ బ్యానర్లో నిర్మించారు. సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ కీలక రోల్ చేశారు. అజయ్-అతుల్ సంగీతం అందించారు. ఆదిపురుష్ చిత్రాన్ని దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ప్రభాస్ వంద కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.