Akhanda 2
Akhanda 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీ విని ఎరుగని రీతిలో కమర్షియల్ సినిమాలను చేస్తూ మంచి విజయాలను సాధించిన దర్శకుడు బోయపాటి శ్రీను… బాలయ్య(Balayya) బోయపాటి (Biyapati) కాంబినేషన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు ఒక సినిమాను మించి మరొక సినిమా సూపర్ సక్సెస్ గా నిలిచాయి. హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్న వీళ్ళ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. అఖండ 2 తో మరోసారి వీళ్ళు పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ని మహా కుంభమేళా సాక్షిగా బోయపాటి శ్రీను స్టార్ట్ చేశాడు. మరి దానికి అనుగుణంగానే ఇప్పుడు బాలయ్య బాబుతో కూడా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరించాలనే ఉద్దేశ్యంతో బోయపాటి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దానికి అనుగుణంగా ఇప్పుడు ఈ సినిమాలో విలన్ గా ఆది పినిశెట్టి(Aadi pinishetti) ని తీసుకోవాలని ఉద్దేశ్యంలో దర్శకుడు ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇప్పటికే బోయపాటి డైరెక్షన్ లో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా వచ్చిన ‘సరైనోడు ‘ (Sarainodu) సినిమాలో ఆది విలన్ గా నటించిన విషయం మనకు తెలిసిందే.
వైరం ధనుష్ అనే పేరుతో కనిపించిన ఆది స్టైలిష్ విలనిజానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ని సెట్ చేశారనే చెప్పాలి. అంతటి గొప్ప పాత్రను పోషించిన తర్వాత ఆయనకు చాలా మంచి సినిమాల్లో అవకాశాలైతే వచ్చాయి. మరి మరోసారి బోయపాటి డైరెక్షన్ లో ఆది పినిశెట్టి తన విలనిజాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
మరి ఇప్పటివరకు సినిమా యూనిట్ నుంచి అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. కాబట్టి ఈ సినిమాలో ఆది పినిశెట్టి చేస్తున్నాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ కనక ఆయన ఈ సినిమాలో చేసినట్టయితే సినిమాకి భారీ బజ్ క్రియేట్ అవ్వడమే కాకుండా మంచి విలనిజం ఉన్న పాత్రను కూడా తను మరోసారి పోషిస్తాడని చెప్పాలి…
మరి బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా భారీ రికార్డులను కూడా కొల్లగొడుతుంది. కాబట్టి ఈ సినిమాలో విలన్ గా అవకాశం వస్తే మాత్రం ఆది పినిశెట్టి మరోసారి తన విశ్వరూపాన్ని చూపిస్తానని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…