Aadavallu Meeku Joharlu Collections: తెలుగు సినీ రంగంలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్రలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా సినిమాలు చేయడం శర్వానంద్ కు మంచి టేస్ట్ ఉంది. ‘శతమానం భవతి’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన శర్వానంద్.. చాలా రోజుల తర్వాత ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అంటూ ఫ్యామిలీ డ్రామా సినిమాతో ముందుకు వచ్చాడు. కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గి అంతా సద్దుమణిగిన తర్వాత వచ్చిన మొదటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ నిలిచింది.

నేను శైలజ, చిత్రలహరి, రెడ్ లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్న కిషోర్ తిరుమల ఈ సినిమాకు డైరెక్షన్ చేశాడు. శర్వానంద్ కు జోడీగా రష్మిక మందన నటించగా.. కీలక పాత్రల్లో ఖుష్బు, రాధికాలు నటించారు. ఈ శుక్రవారం సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాగా.. మొదటిరోజు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఈ సినిమా విడుదల కాగా.. దీని మొదటి రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
Also Read: ఓటీటీలోకి ‘డీజే టిల్లు’.. భారీ ఆదరణ
సినిమా వసూళ్లలో కీలకంగా ఉండే నైజాంలో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా మొదటి రోజు 72లక్షల కలెక్షన్లు రాబట్టింది. ఇక సీడెడ్ లో 18లక్షలు, ఉత్తరాంధ్రలో 20లక్షలు, ఈస్ట్ గోదావరిలో 9లక్షలు, వెస్ట్ గోదావరిలో 8లక్షలు, గుంటూరులో 12లక్షలు, నెల్లూరులో 7లక్షలు రాబట్టింది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఫస్ట్ డే మొత్తం కలెక్షన్ 1.57కోట్లు (2.90కోట్ల గ్రాస్). ఇక కర్ణాటక మరియు మిగిలిన భారతదేశంలో 12లక్షలు వసూల్ చేసింది. అటు ఓవర్సీస్ లో 23లక్షలు కలెక్ట్ చేసింది. కాగా వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ 1.92 కోట్లు (3.60 కోట్లు గ్రాస్).

ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా తక్కువ. మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఇలా కలెక్షన్లు పడిపోయాయని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. భీమానాయక్ హవా తగ్గిపోయిన క్రమంలో ఈ సినిమా కనుక హిట్ టాక్ తెచ్చుకునీ ఉంటే మార్చి 12 వరకు కలెక్షన్లకు ఎలాంటి ఢోకా లేకపోయేది.
Also Read: విజయ్ దేవరకొండతో సమంతను కలుపుతున్న మైత్రి