Aadarsha Kutumbam House No 47: ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) తో ‘ఆదర్శ కుటుంబం’ అనే చిత్రాన్ని మొదలు పెట్టాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో కానీ, లేదా దసరా కానుకగా కానీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 300 కోట్ల గ్రాసర్ తర్వాత విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ లాంటి క్రేజీ డైరెక్టర్ తో చేతులు కలపడం వల్ల ఈ సినిమాకు ఏర్పడిన క్రేజ్ అంతా ఇంతా కాదు. బిజినెస్ ప్రారంభిస్తే ఇప్పటికిప్పుడు హాట్ కేక్ లాగా ఫ్యాన్సీ రేట్స్ కి ఈ చిత్రం అమ్ముడుపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ రేంజ్ క్రేజ్ ఉంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన మేకింగ్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది.
హైదరాబాద్ లోని JBS పెరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఈ మేకింగ్ వీడియో లో విక్టరీ వెంకటేష్ క్యాప్ పెట్టుకొని, కూలింగ్ గ్లాస్సెస్ తో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. మరోపక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ కి సన్నివేశాన్ని వివరిస్తున్నాడు. పక్కనే ఆ చిత్ర నిర్మాత కూడా ఉన్నాడు. ఇక అవతల ప్లాట్ ఫార్మ్ మీద జనాలు ఫుల్ గా ఉన్నారు. వీళ్లంతా మూవీ టీం కి సంబంధించిన వాళ్ళే అట. రెండు రోజుల పాటు ఇదే మెట్రో స్టేషన్ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరగనుంది. వెంకటేష్ ఈ చిత్రం లో మిడిల్ క్లాస్ కి సంబంధించిన వ్యక్తి కావడం తో ఆయనకు మెట్రో స్టేషన్ కి చాలా అనుబంధం ఉంటుంది, ఎందుకో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా KGF ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తుంది. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. అదే విధంగా ప్రముఖ యంగ్ హీరో నారా రోహిత్ ఈ చిత్రం లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. రీసెంట్ గానే ఆయన మూవీ సెట్స్ లోకి కూడా అడుగుపెట్టినట్టు సమాచారం. ఒకప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేష్ కాంబినేషన్ లో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథ ని అందించాడు. ఇప్పుడు మొట్టమొదటిసారి విక్టరీ వెంకటేష్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎలా ఉండబోతుందో చూడాలని వెంకటేష్ అభిమానుల్లోనే కాదు, ఇతర హీరోల అభిమానుల్లో కూడా కుతూహలం ఉంది.
Jbs Parad ground metro station Hyd
#AdarshaKutumbham ~ #AK47 –Shoot going on -> #VenkyXTrivikram
@VenkyMama Super stylish
#VictoryVenkatesh pic.twitter.com/v6x9nA1CAX
— Saketh Venky AK47 (@VenkySaketh143) January 29, 2026