RRR Movie NTR Ram Charan: నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ స్థాయి ఏంటో బాక్సాఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ ద్వారా మరోసారి ఘనంగా రుజువు అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ.. ఎన్టీఆర్ – చరణ్ లు సరికొత్త రికార్డులను సెట్ చేస్తున్నారు. కాకపోతే.. ఇద్దరు హీరో లను బ్యాలెన్స్ చేసే విషయంలో రాజమౌళి కొన్ని చోట్ల తడబడ్డాడు.

హీరోల ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకున్నాడు గానీ, అభిమానుల మధ్య ఘర్షణ తలెత్తకుండా చూసుకోవడంలో జక్కన్న తప్పటడుగు వేశాడు. వ్యక్తిగతంగా ఎన్టీఆర్ అంటే నాకు అమితమైన ఇష్టం అని ఎన్నో సందర్భాల్లో చెప్పిన రాజమౌళి.. ఈ సినిమా విషయంలో మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కాస్త నిరాశ పరిచాడు. నిజానికి సినిమాలో చాలా చోట్ల ఎన్టీఆర్ ను అద్భుతంగా ఎలివేట్ చేశాడు రాజమౌళి.
Also Read: విద్యుత్ చార్జీల పెంపును టార్గెట్ చేసుకున్న బీజేపీ.. టీఆర్ఎస్ పై ప్రతీకారం
ఒక్క సినిమా ముగింపు విషయంలో మాత్రం ఎన్టీఆర్ స్థాయిని రెండో స్థానానికే పరిమితం చేశాడు. ఇక్కడే ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అయితే, మేకర్స్ వెర్షన్ మరోలా ఉంది. క్లైమాక్స్ కి లీడ్ అసలు ఎన్టీఆరే అని.. చరణ్ ప్రాణాలు కాపాడింది ఎన్టీఆరే అని.. క్లైమాక్స్ లో ఒక్క ఫైట్ విషయంలో మాత్రమే చరణ్ ను హైలైట్ చేయడం జరిగిందని చెప్పుకొస్తున్నారు.
ఏది ఏమైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంయమనం పాటించాల్సిన సమయం ఇది. రాజమౌళితో ఎన్టీఆర్ కి ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. నేటికీ తన సోషల్ మీడియా ఎకౌంట్స్ లో ఎన్టీఆర్ ఫాలో అయ్యేది ఒకే ఒక్క వ్యక్తిని.. అది రాజమౌళిని మాత్రమే. ఆర్ఆర్ఆర్ కథ వల్లనో..ఎన్టీఆర్ పాత్ర పరిధి వల్లనో.. సినిమాలో కొంతవరకు చరణ్ తర్వాతే ఎన్టీఆర్ అన్నట్టు ఉంది.

కానీ.. కథకి తగ్గట్టు పాత్రలుంటాయి, హీరోలను బట్టి కాదు. పాత్రలకు తగ్గట్టే ఎవరైనా నటించాలి, అలాగే చిత్రాలను తెరకెక్కించాలి. అందుకే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ‘ఆర్ఆర్ఆర్’ కథను అర్ధం చేసుకుని ప్రస్తుతం వాళ్ళను కమ్ముకున్న నిరాశల నుంచి బయటపడాలని ఆశిద్దాం.
Also Read: ఆర్ఆర్ఆర్ మూవీకి టాప్ మీడియా రేటింగ్ ఎంతిచ్చాయో తెలుసా?