ఎంటర్టైన్మెంట్Viral video : సింహ, కాళభైరవ.. అమృతం సీరియల్‌లో ఎలా ఉన్నారో తెలుసా? వైరల్ వీడియో!

Viral video : సింహ, కాళభైరవ.. అమృతం సీరియల్‌లో ఎలా ఉన్నారో తెలుసా? వైరల్ వీడియో!

Viral video :  అమృతం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో ఈ సీరియల్ చాలా ఫేమస్. ఇప్పటికీ కూడా ఈ సీరియల్‌ను ఎవరూ మర్చిపోలేరు. ముఖ్యంగా 90s కిడ్స్ అయితే దీన్ని రోజూ గుర్తుపెట్టుకుంటారు. ఇలా అప్పటి సీరియల్స్‌లో కొందరు నటులు చిన్నతనంలో ఏదో ఒక సందర్భాల్లో కనిపించి ఉంటారు. అప్పటి ఫొటోలను, ఇప్పటి మనుషులను చూస్తే ఇంత తక్కువ సమయంలో ఇలా మారిపోయారా? అనిపిస్తుంటుంది. అయితే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి ఇద్దరు కుమారులు కూడా సినీ రంగాన్నే ఎంచుకున్నారు. పెద్ద కొడుకు కాళ భైరవ మ్యూజిక్ డైరెక్టర్‌గా చేస్తుండగా చిన్న కొడుకు శ్రీ సింహా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. గుణ్ణం గంగరాజు తీసిన అమృతం సీరియల్ అప్పట్లో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టింది. చాలా మందికి అమృతం సీరియల్‌ ఒక ఎమోషన్. అలాంటి సీరియల్‌లో కీరవాణి ఇద్దరు కొడుకులు కూడా నటించారు. ఓ ఎపిసోడ్‌లో ఇద్దరూ కనిపిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

అందరి ఫేవరేట్ అయిన అమృతం సీరియల్‌లో 12వ ఎపిసోడ్‌లో చిన్న పిల్లలది ఒకటి వచ్చింది. అందులో కాళ భైరవ, శ్రీ సింహా ఇద్దరూ కూడా కనిపించారు. దీంతో అప్పట్లో వీరిద్దరూ ఎంత చిన్న పిల్లలుగా ఉన్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో క్లిప్ నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ.. అప్పట్లో ఎంత క్యూట్‌గా పిల్లలు ఉన్నారో.. ఇప్పుడు ఎంత పెద్ద వాళ్లు అయిపోయారని అంటున్నారు. కాళ భైరవ, శ్రీ సింహా చిన్నప్పుడు ఎలా ఉన్నారో సేమ్ టూ సేమ్ పెద్ద అయిన తర్వాత కూడా అలానే ఉన్నారని నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. కాళ భైరవ మ్యూజిక్ డైరెక్టర్‌గా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. శ్రీ సింహా హీరోగా ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల మత్తు వదలరా 2 సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. కామెడీ జోనర్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ కొట్టింది.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమాతో శ్రీ సింహా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. చిన్నప్పటి ఎన్టీఆర్ పాత్రలో నటించాడు. ఆ తర్వాత సునీల్ హీరోగా వచ్చిన మర్యాద రామన్న సినిమాలో కూడా బాలనటుడిగా కనిపించగా.. ఈగ సినిమాలో సమంతకు ఫ్రెండ్‌గా నటించాడు. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. అయితే మత్తు వదరలా సినిమాతో శ్రీ సింహా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే శ్రీసింహా ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ప్రముఖ సీనియర్ నటుడు మురళీ మోహన్ మనవరాలు అయిన రాగ మాగంటిని శ్రీ సింహా వివాహం చేసుకున్నాడు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. డిసెంబర్ 14న వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. అయితే వీరి వివాహానికి స్నేహితులు, కుటుంబసభ్యులు, ఇండస్ట్రీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు.

SriSimha, KalaBhairava #amruthamcomedy #amruthamtvserial #amruthamserial #90s #90severgreen #shorts
Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...

Jr NTR – Teja : నీతో సినిమా చేయలేనని డైరెక్ట్ గా ఎన్టీఆర్ కే చెప్పేసిన డైరెక్టర్ తేజ… కారణమేంటంటే…

Jr NTR  Teja Director : చిత్రం, నువ్వు నేను, జయం లాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు తేజ... అప్పట్లో ఆయనకు చాలా మంచి క్రేజ్ ఉండేది. యంగ్ హీరోలందరు అతనితో...

Most Popular

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...

Anil Ravipudi: అనిల్ రావిపూడి ని పట్టించుకోని స్టార్ హీరోలు వీళ్లే…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీ లో కమర్షియల్ డైరెక్టర్స్ కి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే వాళ్లు హీరోలను పర్ఫెక్ట్ టెంప్లేట్ లో చూపిస్తూ ఉంటారు. ఒక ఫైట్ తర్వాత ఒక...

Ravi Teja : కూతురుతో కలిసి ‘ఇరుముడి’ కి డబ్బింగ్ చెప్తున్న రవితేజ.. వీడియో వైరల్..

Ravi Teja : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'ఇరుముడి' పై మార్కెట్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ బజ్ ఏర్పడింది. సుబ్రమణ్యస్వామి బ్యాక్ డ్రాప్ లో...
Exit mobile version