Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు ఈ చిత్రానికి ఏకంగా 274 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కేవలం మొదటి రోజు మాత్రమే కాదు రెండవ రోజు కూడా ఈ చిత్రానికి వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ హిందీ వెర్షన్ వసూళ్లతో పోలిస్తే తెలుగు వెర్షన్ వసూళ్లు కాస్త తక్కువగానే వస్తున్నాయి అని చెప్పొచ్చు. ముఖ్యంగా సామాన్యులకు టికెట్ రేట్స్ అందుబాటులో లేవు అని పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో నెటిజెన్స్ గోల చేస్తున్నారు. ఒక కుటుంబం మొత్తం కలిసి సినిమాకి వెళ్లాలంటే ఇంతకు ముందు వెయ్యి రూపాయిలు అయ్యేది, ఇప్పుడు రెండు వేల రూపాయిలు అవుతుంది అంటూ పెదవి విరుస్తున్నారు.
నైజాం క్రింది ప్రాంతాల్లో టికెట్ రేట్స్ ప్రభావం వల్ల వసూళ్లు తగ్గడంతో రేట్స్ బాగా తగ్గించారు నిర్మాతలు. ఫలితంగా నేడు అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. నేడు కేవలం తెలంగాణ ప్రాంతం నుండి ఈ చిత్రానికి 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తుందని అంచనా వేస్తున్న ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 213 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేయాలి. మరి ఈ సినిమా ఆ రేంజ్ వసూళ్లను రాబట్టే దిశగా, బాక్స్ ఆఫీస్ వద్ద పరుగులు తీస్తోందా?, అసలు రెండు రోజులకు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయి. రెండవ రోజు ఎంత వసూళ్లు వచ్చింది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.
ట్రేడ్ పండితులు అందించిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నైజాం ప్రాంతం లో రెండవ రోజు 8 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని, రెండు రోజులకు కలిపి 33 కోట్ల 78 లక్షల రూపాయిలు వచ్చాయని అంటున్నారు. అదే విధంగా సీడెడ్ ప్రాంతంలో రెండవ రోజు 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టగా, రెండు రోజులకు కలిపి 13 కోట్ల 20 లక్షల రూపాయిలను రాబట్టింది అంటున్నారు. ఈ ప్రాంతంలో బ్రేక్ ఈవెన్ పొందాలంటే 35 కోట్ల రూపాయిలను రాబట్టాలి. అదే విధంగా వైజాగ్ లో 8 కోట్ల రూపాయిలు, తూర్పు గోదావరి జిల్లాలో 5 కోట్ల రూపాయిలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కోట్ల 30 లక్షల రూపాయిలు, కృష్ణ జిల్లాలో 5 కోట్ల 10 లక్షల రూపాయిలు, గుంటూరు జిల్లాలో 6 కోట్ల 90 లక్షల రూపాయిలు, నెల్లూరు జిల్లాలో 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రెండు రోజులకు కలిపి వచ్చింది. ఓవరాల్ గా రెండు రోజులకు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 80 కోట్ల రూపాయిలు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే ఇంకా 132 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.